దేశీయ ఆటోమెుబైల్ రంగంలో స్పోర్ట్స్ బైక్స్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ బైక్స్ మార్కెట్ వాల్యూ గతంతో పోలిస్తే క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో అనేక రకాల స్పోర్ట్స్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. కార్లు సైతం వీటి వేగం ముందు చిన్నబోవాల్సిందే. ఆయా స్పోర్ట్స్ బైక్స్‌పై రైడింగ్‌ను యూత్ ఎప్పటికీ మర్చిపోలేరు. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆ టాప్-7 బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Bajaj dominar 400
బజాజ్.. ఈ స్పోర్ట్స్ బైక్‌ను అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తీసుకొచ్చింది. డిజిటల్ స్పీడోమీటర్, టాకోమీటర్, స్ప్లిట్ సీట్, అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, LED హెడ్‌లైట్, టెయిల్‌లైట్, LED టర్న్ సిగ్నల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది స్మోక్డ్ విజర్, ఇంజన్ బాష్ ప్లేట్, పిలియన్ బ్యాక్‌రెస్ట్, నావిగేషన్ మౌంట్, USB ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగివుంది. 373.3 cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్ గరిష్టంగా 40PS @ 8800 rpm శక్తిని ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బైక్ 27 kmpl మైలేజీని అందిస్తుంది. దీని ఆన్ రోడ్ ధర రూ.2,79,123.
Bajaj Pulsar N250
ఈ పల్సర్ బైక్ 248.07 cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8750 rpm వద్ద 24.5 PS శక్తిని, 6500 rpm వద్ద 21.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చివుంది. 14 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. సీటు ఎత్తు 795 మిల్లీమీటర్లు. ముందు భాగంలో 37 MM టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీని ధర రూ.1,51,510గా ఉంది.
TVS Apache RR 310
ఈ స్పోర్ట్స్ బైక్ 312.2 cc సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 34 bhp, 28 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. RR 310 బైక్ గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఏ RPM దగ్గరైనా మంచి టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7,000 నుండి 9,000 rpm వద్ద దాని బెస్ట్ ఎనర్టీని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.2,72,000 (ఎక్స్ షోరూమ్).
TVS Apache RTR 310
ఈ బైక్ 312 cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 35.6 bhp పవర్, 28.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి కూడా 6 స్పీడ్ గేర్‌బాక్స్ జతచేశారు. దీనికి అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు. ఈ బైక్ కేవలం 2 సెకన్లలో గంటకు 45.6 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ బైక్‌లో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. దీని ధర రూ. 2,57,990.
KTM RC 390
ఇందులో 373.27సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఇన్‌స్టాల్ చేశారు. ఇది గరిష్టంగా 43.5 bhp పవర్, 37 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ బైక్‌లో పూర్తి డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఛానల్ సూపర్‌మోటో ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, క్విక్‌షిఫ్టర్, LED లైటింగ్, కార్నరింగ్ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌లో 13.7 లీటర్ ఇంధన ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ బైక్ నగరంలో 25.89kmpl, హైవేపై 31.22kmpl మైలేజీని ఇవ్వగలదు. దీని ధర రూ.3,18,893 (ఎక్స్ షోరూమ్).
KTM Duke 390
ఈ సరికొత్త డ్యూక్ బైక్‌ను 399 cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో తీసుకొచ్చారు. ఇది 44.25 bhp పవర్, 39 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్‌కి 6 స్పీడ్ గేర్ బాక్స్ జతచేశారు. బైక్‌కి క్విక్‌షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు. కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 5 అంగుళాల TFT, టర్న్ బై టర్న్ నావిగేషన్, C ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే 17 అంగుళాల అల్లాయ్ రిమ్, కార్నరింగ్ ABS, వైడ్ LED హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్ సెటప్ వంటివి ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 3,11,233గా ఉంది.
KTM 390 Adventure Bike
KTM 390 అడ్వెంచర్ బైక్‌కు ముందు భాగంలో WP APEX అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌లను అందించారు. ఇది కంప్రెషన్, రీబౌండ్ డంపింగ్ రెండింటినీ సర్దుబాటు చేస్తుంది. అలాగే బైక్‌కి 10 లెవెల్స్ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ, రీబౌండ్ డంపింగ్‌తో వెనుక మోనోషాక్ ఇచ్చారు. ఇందులో 19 అంగుళాల ముందు, 17 అంగుళాల వెనుక ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. తలకిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్‌లు కంప్రెషన్, రీబౌండ్ కోసం 30 సెట్టింగ్‌లను కలిగివున్నాయి. దీని ధర రూ.3,39,535లుగా ఉంది.