Upcoming Electric Scooters: త్వరలో విడుదల కానున్న బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Electric Scooters: త్వరలో విడుదల కానున్న బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఇవే..!

    Upcoming Electric Scooters: త్వరలో విడుదల కానున్న బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ ఇవే..!

    December 2, 2023

    దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ స్కూటీలు/ బైక్స్‌ తక్కువ ధరలో ఉండటం కూడా దీనికి  కారణంగా చెప్పవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఈవీ స్కూటర్లపై వాహనదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈవీ సంస్థలు అధునాతన ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరికొన్ని EV స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. త్వరలో రానున్న టాప్‌ ఎలక్ట్రిక్‌ బైక్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    Simple Dot One

    ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ నెలలోనే రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 99,000 వరకూ ఉండవచ్చని ఆటోమెుబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ స్కూటర్‌ W electric motorతో రానుంది. దీనిని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 160 కిలోమీటర్ల వరకూ అలవోకగా ప్రయాణం చేయవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. లాంచింగ్‌ రోజున మరిన్ని ఫీచర్ల గురించి వెల్లడించనున్నట్లు ప్రకటించాయి. 

    Ather 450X Gen 3

    ఈ ఎలక్ట్రిక్‌  స్కూటర్‌ కూడా ఈ నెలలోనే రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇది 90 km/hr టాప్‌ స్పీడ్‌ను కలిగి ఉంది. బ్యాటరీకి 3 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తారట. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. 0-80 శాతం ఛార్జింగ్‌కు 4 గం.ల 30 ని. సమయం పడుతుందని పేర్కొన్నాయి. స్కూటీ ధర రూ.1.30 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా. 

    Lectrix EV LXS G 3.0

    ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది. ఇది 3 Kwh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 80-105 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. టాప్‌ స్పీడ్‌ 60 km/hrగా ఉంది. 2200 మోటర్‌ పవర్‌ను దీనికి అందించారు. డిజిటల్‌ స్పీడోమీటర్‌తో బైక్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటీ ధర రూ.1.21 లక్షల వరకూ ఉండవచ్చని ఆటోమెుబైల్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    Honda Activa Electric

    హోండా నుంచి అద్భుతమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ త్వరలో రాబోతోంది. Honda Activa Electric పేరుతో కొత్త స్కూటర్‌ను తీసుకురానుంది. దీని టాప్‌ స్పీడ్‌  90-100 కిలోమీటర్లుగా ఉండనుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 160-200 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ స్కూటీ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దీని ధర రూ.1.10 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా. డిజిటల్‌ డిస్‌ప్లేతో ఈ స్కూటీ రానుంది. 

    Hero Electric AE-8

    హీరో కంపెనీ కూడా ఓ ఈవీ స్కూటర్‌ను తీసుకొస్తోంది. Hero Electric AE-8 పేరుతో జనవరిలో దీన్ని లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని టాప్‌ స్పీడ్‌ 45 కిలో మీటర్లుగా ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 80 km వరకూ ప్రయాణించవచ్చు. దీని ధర రూ.70,000 మాత్రమేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌తో ఈ స్కూటీ రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version