కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా మరికొన్ని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్ కల్యాణ్, కమల్‌హాసన్ వంటి స్టార్ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్ వాటెండ్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.
హనుమాన్
ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘హనుమాన్’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్ విడుదల కానుంది.
భారతీయుడు 2
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం ‘భారతీయుడు 2’. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్ హాసన్ కనిపించనున్నారు.
పుష్ప 2
సుకుమార్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప2’ (Pushpa 2). తొలి భాగం ‘పుష్ప’ పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్‌సింగ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
గేమ్ ఛేంజర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ
సలార్ సూపర్ హిట్ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్ ‘స్పిరిట్’ (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్ స్టార్ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలియజేశారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!