Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?

    Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్‌… స్టోరీ ఇదేనా?

    May 9, 2024

    ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ను మూటగట్టుకుంది. ఇదనే కాదు విజయ్‌ చేసిన గత మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో విజయ్‌ తన క్రేజ్‌ నిలబెట్టుకోవాలంటే సూపర్ హిట్‌ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ హీరో తన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇవాళ విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

    హిస్టారికల్‌ మూవీ

    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda New Movie), డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో ‘VD14’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి విజయ్‌ బర్త్‌డే సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ పోస్టర్ లో ఓ వీరుడి విగ్రహం ఉంది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని దీని గురించి తెలిపారు. 1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని పోస్టర్ పై వేశారు. ‘ఇతిహాసాలు రాయలేదు.. అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి’ అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. 

    భారీ అంచనాలు

    ‘VD14’ (Vijay Deverakonda Periodical Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారింది. హీరో విజయ్‌ తొలిసారి చేయనున్న హిస్టారికల్‌ సినిమా కావడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. అటు విజయ్‌ ఫ్యాన్స్‌ కూడా కొత్త మూవీ పోస్టర్‌ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్స్ వేస్తుందని ఇప్పటినుంచే ధీమా వ్యక్తం వేస్తున్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ గతంలోనూ విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా చేశాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాహుల్‌ చేసిన శ్యామ్ సింగరాయ్‌ మూవీ కూడా తెలుగు ఆడియన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది. 

    ‘VD12’ నుంచి అప్‌డేట్‌

    ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ.. గౌతం తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ‘VD12‘ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా, ఇవాళ విజయ్ బర్త్‌డే పురస్కరించుకొని దర్శక నిర్మాతలు విషెస్‌ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ ద్వారా షూటింగ్ అప్‌డేట్‌ను కూడా ఇచ్చారు. వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చిత్రీకరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక భారీ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పై థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. VD12 వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. 

    విజయ్‌ డేరింగ్ డెసిషన్‌!

    ‘VD12’ సినిమా కోసం హీరో విజయ్‌ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు.  ఈ సినిమాలో ఒక్క పాట లేకుండా నటించేందుకు విజయ్‌ సిద్ధపడినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు ఓ బలమైన కారణం ఉన్నట్లు టాలీవుడ్‌లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో విజయ్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్టులో పాటలు పెడితే కథనం, మూవీ ఫ్లేవర్‌ దెబ్బతింటాయని డైరెక్టర్‌ గౌతమ్‌ భావిస్తున్నారట. దీంతో పాటలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్‌ చేద్దామని విజయ్‌తో ఆయన అన్నాడట. ఇందుకు విజయ్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version