Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్‌, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్‌, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా?

    Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్‌, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా?

    October 11, 2024

    నటీనటులు : గోపిచంద్‌, కావ్యా థాపర్, నరేష్‌, ముఖేష్‌ రిషి, జిషూ సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్‌, సునీల్‌, శ్యామ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పృథ్వీ తదితరులు

    దర్శకత్వం : శ్రీను వైట్ల

    సంగీతం : చేతన్ భరద్వాజ్‌

    సినిమాటోగ్రఫీ : కె. వి. గుహన్‌

    ఎడిటింగ్‌ : అమర్‌ రెడ్డి

    నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి. విశ్వ ప్రసాద్‌

    విడుదల తేదీ : అక్టోబర్‌ 11, 2024

    ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్ల, యాక్షన్‌ హీరో గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న (Viswam Movie Review) విడుదలైన ‘విశ్వం’ వారికి విజయాజాన్ని అందించిందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమె పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే గోపిరెడ్డి ఆ కుటుంబానికి పరిచయం కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇటలీలో కలిసిన సమైరా (కావ్య థాపర్‌)కు గోపిరెడ్డి ఎందుకు దూరమయ్యాడు? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    నటుడు గోపిచంద్‌ ఎప్పటిలాగే తన సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో మెప్పించాడు. తనలో మంచి కామెడీ టైమింగ్‌ కూడా ఉందని విశ్వంతో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే గత చిత్రాలతో పోలిస్తే గోపిచంద్‌ పాత్రలో పెద్దగా వైవిధ్యం లేదు. రొటీన్‌ పాత్రనే చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌ కావ్యా థాపర్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ దక్కలేదు. అయితే గ్లామర్‌గా మాత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. నరేష్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, రాహుల్ రామకృష్ణ పాత్రలు సినిమాలో బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ట్రైన్‌ ఎపిసోడ్‌లో వారి పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    ఆనందం’, ‘సొంతం, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు తీసిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో కాస్త ట్రాక్‌ తప్పారు. అయితే తన బలాబలాలు గుర్తించి ‘విశ్వం’తో మళ్లీ యాక్షన్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఔట్‌డేటేడ్‌ స్టోరీని ఎంచుకోవడం మైనస్‌గా చెప్పవచ్చు. పంచ్‌లు, కామెడీ ట్రాక్‌ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, పృథ్వీ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటలీ ట్రాక్‌లో కొత్త దనం కనిపించదు. విలన్‌ పాత్ర కూడా బలహీనంగా అనిపిస్తుంది. హీరో – హీరోయిన్ లవ్‌ ట్రాక్‌ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్‌ సీన్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా విశ్వం పర్వాలేదనిపిస్తుంది. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్‌ అందించిన సంగీతం డీసెంట్‌గా అనిపిస్తుంది. రెండు, మూడు సాంగ్స్‌ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. కె.వి గుహన్‌ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. అమర్‌ రెడ్డి కుడుముల తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టే ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపించింది.

    ప్లస్‌ పాయింట్స్‌

    • గోపిచంద్‌ నటన
    • కామెడీ 
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్

    • ఔట్‌డేటెడ్‌ స్టోరీ 
    • సాగదీత సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 2.5/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version