Vivo V30 Series: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో సరికొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు మీకోసం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo V30 Series: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో సరికొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు మీకోసం!

    Vivo V30 Series: 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో సరికొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లతో పాటు పూర్తి వివరాలు మీకోసం!

    September 26, 2024

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ వివో.. మరో సరికొత్త సిరీస్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. గురువారం ‘Vivo V30 Series’ పేరుతో నయా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ Vivo V30 సిరీస్‌లో ‘Vivo V30’, ‘Vivo V30 Pro’ అనే రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏకంగా 50MP సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్లు రావడం విశేషం. ఈ తరహాలో టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ఎన్నో ఫీచర్లు ‘వివో వి30 సిరీస్‌’లో ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా మెుబైల్‌ కొనాలని భావించేవారికి ఈ నయా వివో ఫోన్స్‌ బెస్ట్ ఆప్షన్ అవుతాయని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ‘Vivo V30 Series’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Vivo V30, Vivo V30 Pro వేరియంట్లు..  6.78 అంగుళాల కర్వ్డ్‌ 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్‌ అయ్యాయి. వీటికి 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2,800 పీక్‌ బ్రైట్‌నెస్‌ అందించారు. Vivo V30 మోడల్‌ Snapdragon 7 Gen 3 SoC ప్రొసెసర్‌తో రాగా.. ప్రో వేరియంట్‌ MediaTek Dimensity 8200 chipsetతో విడుదలైంది. ఈ రెండు వేరియంట్లు Android 14 ఆధారిత  FunTouchOS 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై వర్క్‌ చేస్తాయి. 

    ర్యామ్‌ & స్టోరేజ్

    Vivo V30 వేరియంట్‌.. 8GB RAM/ 128GB, 12GB RAM / 256GB, 12GB + 512GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో రిలీజైంది. అటు V30 Pro వేరియంట్‌.. 8GB RAM / 256GB ROM, 12GB RAM/512GB స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 1TB వరకూ పెంచుకునే వెసులుబాటును వివో కల్పించింది. 

    కెమెరా 

    Vivo V30 సిరీస్‌లో ప్రధానంగా ఆకట్టుకుంటున్న ఫీచర్లలో కెమెరా ఒకటి. Vivo V30 వేరియంట్‌ 50MP సెల్ఫీ కెమెరాతో పాటు డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS)తో పనిచేసే 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, ఔరా ఫ్లాష్‌ లైట్‌.. ఫోన్‌ వెనుక భాగంలో ఉన్నాయి. ఇక V30 Pro వేరియంట్‌.. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ (50MP + 50MP + 50MP)తో రావడం గమనార్హం. ఇందులో Vivo V30 తరహాలోనే రెండు 50MP కెమెరాలతో పాటు అదనంగా మరో 50MP పొట్రెయిట్‌ (portrait) కెమెరాను దీనికి అందించారు. ఈ మోడల్‌కు కూడా ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేశారు. 

    బ్యాటరీ సామర్థ్యం

    Vivo V30, Vivo V30 Pro రెండు వేరియంట్లు.. 5,000mAh బ్యాటరీతో భారత్‌లో లాంచ్ అయ్యాయి. వీటికి ఏకంగా 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు అందించడం విశేషం. దీని ద్వారా మెుబైల్‌ అత్యంత వేగంగా ఛార్జ్‌ చేసుకోవడంతో పాటు అధిక బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. USB Type-C పోర్టు ద్వారా మెుబైల్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Vivo V30 సిరీస్‌లోని రెండు మోడల్స్‌.. Wi-Fi, Bluetooth, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ప్రారంభ వేరియంట్‌ Bluetooth 5.4 వెర్షన్‌తో రాగా.. ప్రో వేరియంట్‌ Bluetooth 5.3 కనెక్టివిటీతో భారత మార్కెట్‌ లాంచ్‌ అయ్యింది. ఇక ఈ రెండు ఫోన్లు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ (In Display Fingerprint Scanner) ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. 

    ధర ఎంతంటే?

    Vivo V30 సిరీస్‌ ధరను కంపెనీ వేరియంట్, స్టోరేజ్‌ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించింది. Vivo V30 Pro  8GB + 256GB మోడల్‌ ధరను రూ.41,999 ప్రకటించింది. 12GB + 512GB మోడల్‌ను రూ.46,999గా పేర్కొంది. అటు Vivo V30లో 8GB + 128GB ధర రూ.33,999, 8GB + 256GB రూ. 35,999, 12GB + 512GB రూ.37,999గా కంపెనీ ప్రకటించింది. మార్చి 14 నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఈ-స్టోర్‌లోనూ లభిస్తాయి. 

    బ్యాంక్ ఆఫర్లు

    ఆన్‌లైన్‌లో Vivo V30, V30 Pro మెుబైల్స్‌ కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. SBI లేదా HDFC కార్డ్స్‌ కొనుగోలుపై 10% వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే 6 నెలల వరకూ నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ కింద మరో రూ.4,000 రాయితీ పొందవచ్చు. ఇక వినియోగదారులు మెయిన్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చేయాలని భావిస్తే.. అక్కడ కూడా 10% డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుందని వివో వర్గాలు తెలిపాయి. 8 నెలల వరకూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈఎంఐ చెల్లించవచ్చని పేర్కొన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version