చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo)కు భారత్‌లో మంచి క్రేజ్ ఉంది. బడ్జెట్, మిడ్‌రేంజ్‌లో ఆ కంపెనీ ఫోన్లు గుడ్‌విల్ కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివో మరో సరికొత్త మెుబైల్‌తో దేశంలో అడుగుపెట్టబోతోంది. అక్టోబర్ 23న ‘Vivo Y200 5G’ అనే కొత్త మెుబైల్‌ను లాంచ్ చేయబోతోంది. Vivo Y100 మెుబైల్‌కు అనుసంధానంగా దీనిని తీసుకొస్తోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లీకైన ‘Vivo Y200 5G’ మెుబైల్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
Vivo Y200 5G ఫోన్.. 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇది 2,400 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుందట. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch OSపై మెుబైల్ వర్క్ చేయనుంది.
స్టోరేజ్ సామర్థ్యం
ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ కావచ్చని లీకైన సమాచారం చెబుతోంది. 8GB RAM / 128GB ROM ఫోన్‌కు అందించినట్లు సమాచారం. వర్చువల్‌గా ర్యామ్ మరో 8GB వరకూ పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిసింది.
కెమెరా క్వాలిటీ
వివో Y200 మెుబైల్.. డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుందట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను ఫోన్ కలిగి ఉంటుందట. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బ్యాటరీ సామర్థ్యం
Vivo Y200 5G ఫోన్‌ను 4,800mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక డివైజ్ బరువు 190 గ్రాములు, మందం 7.69 మి.మీ ఉండనుందని సమాచారం.
కలర్ ఆప్షన్స్
Vivo Y200 మెుబైల్ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ వంటి కలర్ వేరియంట్లలో లాంచ్ కానుంది.
ధర ఎంతంటే?
Vivo Y200 మెుబైల్ ధరపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్టోబర్ 23న దీనిపై స్పష్టత రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.24,000 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్‌లోని మోటోరోలా ఎడ్జ్ 40 నియో, పోకో ఎఫ్5, ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ వంటి స్మార్ట్‌ఫోన్స్‌కు పోటీగా వివో దీన్ని తీసుకొస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి.