‘టబు’.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో చిత్రాల్లో నటించిన టబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అన్నట్లుగా నడి వయసులోనూ టబు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.
ఇదిలా ఉంటే iగత వారం రోజులుగా టబు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. టబు హాట్ లుక్స్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆహా ఏమి అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టబు గ్లామర్ ఫొటోలు, వీడియోలు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.
టబు నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ ‘బోళా’ చిత్రం ఇవాళే విడుదలైంది. కార్తి నటించిన ఖైదీ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించగా.. పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిణిగా టబు కనిపించింది.
డయనా జోసెఫ్ పాత్రలో టబు నటన ఆకట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ‘కుత్తే‘ వెబ్‌సిరీస్‌లోనూ టబు నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
గతేడాది టబు చేసిన రెండు బాలీవుడ్ సినిమాలు ‘భూల్ భులయ్యా 2’, ‘దృశ్యం 2’ సూపర్‌హిట్‌గా నిలిచాయి. భూల్ భులయ్యా 2 లో ద్విపాత్రిభినయం చేసిన టబు ప్రేక్షకుల మన్ననలు పొందారు.
దయ్యం పాత్రలో కనిపించి భయపెట్టారు. దృశ్యం 2 లోనూ అజయ్‌దేవగణ్ భార్యగా నటించి ప్రశంసలు అందుకున్నారు.
టాలీవుడ్ నిన్నటి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ల సూపర్ హిట్ సినిమాల్లో టబు నటించారు. ఆ తర్వాత టాలీవుడ్‌కు కొంచెం గ్యాప్ ఇచ్చారు.
మళ్లీ 2020లో అలా వైకుంఠపురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను టబు పలకరించారు. ఇందులో టబు నటన సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్