ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ (Flipkart) ప్రతీ ఏటా అదిరిపోయే సేల్స్‌తో కస్టమర్లకు సర్ప్రైజ్ ఇస్తుంటుంది. ఈ ఏడాది కూడా ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Grand Home Appliances Sale), ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ (Big Bachat Dhamaal Sale)ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో అద్బుతమైన సేల్‌ను ప్రకటించింది. త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days) సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబందించిన టీజర్‌ను ఈ-కామర్స్ సంస్థ రిలీజ్ చేసింది. అంతేగాక తన వెబ్సైట్లో ఆఫర్లతో కూడిన ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ మెగా సేల్‌లో ఏ ఏ వస్తువులపై డిస్కౌంట్లు ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ బ్రాండ్లపై భారీ తగ్గింపు..!
‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై ఫ్లిప్‌కార్ట్ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈ సేల్‌లో ఏ ఏ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయో మాత్రం రివీల్ అయిపోయాయి. విశ్వసనీయ వర్గాలు సమాచారం మేరకు.. ఈ సేల్‌లో యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) , వివో (Vivo), రియల్మీ (Realme), గూగుల్ (Google), షావోమీ (Xiaomi), నథింగ్ (Nothing), ఇన్ఫీనిక్స్ (Infinix) స్మార్ట్ఫోన్లపై 80 శాతం వరకూ డిస్కౌంట్స్ ఉండనున్నాయి.
ఈ ఫోన్లపై డిస్కౌంట్లు
ఈ మెగా సేల్‌లో మోటో జీ 54 5G (Moto G54 5G), శామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్ 34 5జీ (Samsung Galaxy F34 5G), రియల్మీ సీ51 (Realme C51), రియల్మీ 115జీ (Realme 115G), రియల్మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G), ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G), మోటో జీ84 5జీ (Moto G84 5G), వివో వి29ఈ (Vivo V29e), పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) ఫోన్ల ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే 0 శాతం వడ్డీతో EMI, రూ.999 డౌన్‌పేమెంట్‌తో EMI, 3నెలలు, 6 నెలలు, 9 నెలలు, 12 నెలల నోకాస్ట్ EMI ఆఫర్స్ కూడా లభించనున్నాయి.
ఆయా తేదీల్లో స్పష్టత
ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఫోన్ డిస్కౌంట్స్ గురించి అక్టోబర్ 1న తెలియజేయస్తామని వెల్లడించింది. అక్టోబర్ 3న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్స్ గురించి, అక్టోబర్ 5న పిక్సెల్ ఫోన్ డీల్స్ గురించి, అక్టోబర్ 7న షావోమీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల గురించి ప్రకటించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ సహా వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఈ సేల్‌లో అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
10% రాయితీ
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ బ్యాంక్ (Kotak Bank) డెబిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్‌లో పేటీఎం (Paytm) కూడా గ్యారెంటీడ్ సేవింగ్స్ ఆఫర్స్ అందించనుంది. ముఖ్యంగా పేటీఎం వాలెట్ (Paytm Wallet), యూపీఐ (UPI) ద్వారా పేమెంట్స్ చేస్తే కచ్చితంగా మంచి డిస్కౌంట్ అందించనున్నట్లు స్పష్టం చేసింది.
పే లేటర్ ఆప్షన్
ఈ సేల్ సమయంలో మీ దగ్గర సమయానికి డబ్బు లేకపోయినా చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ (Flipkart Pay later) ఫీచర్ ఉపయోగించి.. ముందుగా మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత నిర్దిష్ట సమయంలోపు మీరు ఫ్లిప్‌కార్ట్‌కు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేస్తే మంచి డిస్కౌంట్ సహా, మంత్లీ నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!