• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 – డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.  అవేంటో ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:

    యానిమల్‌ 

    రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం. 

    అథర్వ

    కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    కాలింగ్‌ సహస్ర

    జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.  విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది.

    ఉపేంద్ర గాడి అడ్డా

    ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    విక్రమ్‌ రాథోడ్‌

    విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

    ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు

    దూత

    యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది.

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Candy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1
    ObliteratedSeriesEnglishNetflixNov 30
    Family SwitchMovieEnglishNetflixNov 30
    The Bad GuysMovieEnglishNetflixNov 30
    Mission RaniganjMovieHindiNetflixDec 1
    Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1
    The equalizer 3MovieEnglishNetflixDec 1
    Catering ChristmasMovieEnglishNetflixDec 1
    Chinna MovieTelugu/TamilDisney+HotstarNov 28
    Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1
    monster inside MovieEnglishDisney+HotstarDec 1
    Martin luther kingMovieTeluguSonyLIVNov 29
    DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv