అలనాటి నటి సిల్క్ స్మిత (Silk Smitha) జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నటి చంద్రికా రవి (Chandrika Ravi) ఈ చిత్రంలో సిల్క్ స్మితగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లో ఆమె అచ్చం స్మితాాలానే కనిపించి అందర్ని ఆశ్చర్యపరించింది. ఇంతకి చంద్రికా ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు చూద్దాం.
చంద్రిక భారత సంతతి వ్యక్తి. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతి కుటుంబంలో ఆమె జన్మించారు.
చిన్నప్పటి నుంచే చంద్రికాకు నటనపై ఆసక్తి. అందుకే మూడేళ్ల వయసులోనే డ్యాన్సింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇక 16 ఏళ్లకే నటిగా, మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు.
కెరీర్లో ఉన్నతస్థాయికి చేరాలన్న ఉద్దేశంతో కుటుంబానికి దూరంగా లాస్ ఏంజెల్స్ వెళ్లారు చంద్రికా. అక్కడ ఆమె పలు టీవీ షోస్‌లో నటించారు.
2018లో తమిళంలో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కత్తు’ చిత్రం ద్వారా ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో దయ్యం పాత్ర పోషించి చంద్రికా అందరి దృష్టిని ఆకర్షించింది
2019లో వచ్చిన చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో చంద్రికా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో వచ్చిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’కు ఇది రీమేక్.
‘వీర సింహారెడ్డి’ సినిమాలో ఓ పాటలోనూ చంద్రికా తళుక్కుమంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ పాట తర్వాత ఆమెకు యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది.
తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని చంద్రికా ఓ ఇంటర్యూలో తెలిపింది. ఇక్కడే స్థిరపడాలని ఉందని చెప్పుకొచ్చింది.
కెరీర్ కోసం కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం తనకు ఎంతో బాధగా ఉంటున్నట్లు చంద్రికా చెప్పింది.
ప్రస్తుతం చేస్తున్న సిల్క్ స్మిత బయోపిక్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ భామ చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం తాను ఎంతగానో శ్రమిస్తున్నట్లు చెప్పింది.
సిల్క్ స్మిత బయోపిక్ కోసం చంద్రికా చాలా రిసెర్చ్ చేసిందట. స్మిత నటించిన చిత్రాలు చూడటం, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పలు విషయాలను తెలుకోవడం వంటివి చేసిందట.
ఈ భామ సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా వ్యవహిరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
చంద్రిక గ్లామర్ షోకు ఫిదా అయిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను అనుసరిస్తున్నారు. ఆమె ఇన్‌స్టా ఖాతాను 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!