• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • My Dear Donga Review: కామెడీతో అదరగొట్టిన అభినవ్‌ గోమఠం.. ‘మై డియర్‌ దొంగ’ ఎలా ఉందంటే?

    నటీనటులు: అభినవ్ గోమఠం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్

    దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్

    రచన: శాలినీ కొండేపూడి

    సంగీతం: అజయ్ అరసాద

    ఎడిటర్: సాయి మురళి

    సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్

    నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల

    స్ట్రీమింగ్‌ వేదిక : ఆహా

    హాస్యనటుడు ‘అభినవ్‌ గోమఠం‘ ప్రధాన పాత్రలో చేసిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga Review). ఇందులో షాలిని కొండెపూడి (Shalini Kondepudi) మరో కీలక పాత్ర పోషించింది. కాగా, ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో ప్రసారం అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను అలరించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. 

    కథేంటి?

    సుజాత (షాలిని), డాక్టర్‌ విశాల్‌ (నిఖిల్‌ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్న కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంటుంది. ఎక్కడకు పిలిచినా బిజీ అని చెబుతున్నాడనీ ఫీలవుతుంది. ఈ క్రమంలోనే సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్‌ చేసేందుకు విశాల్‌ ఆమె ఫ్రెండ్స్‌తో ఇంటికి వస్తాడు. అప్పటికే విశాల్‌తో మాట్లాడిన సుజాత.. ఫ్రెండ్స్‌కు అతడ్ని బాల్య స్నేహితుడిగా పరిచయం చేస్తుంది. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి? 

    ఎవరెలా చేశారంటే?

    నటి షాలిని కథను ముందుండి నడిపించింది. సుజాత పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగా అనిపిస్తాయి. ఎప్పటిలానే అభినవ్‌ తన కామెడీతో గిలిగింతలు పెట్టాడు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. సుజాతను ప్రేమించిన డాక్టర్‌ విశాల్‌ పాత్రలో నిఖిల్‌ ఫర్వాలేదనిపించాడు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్‌, వెయిటర్‌గా నటించిన వంశీధర్‌ గౌడ్‌ తమ నటనతో ఓకే అనిపించారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. సుజాత ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, విశాల్‌తో లవ్‌ ఎపిసోడ్‌తో సినిమాను నెమ్మదిగా స్టార్ట్‌ చేసిన డైరెక్టర్‌.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్‌ ప్రవేశించడం నుంచి కథలో వేగం పెంచారు. అభినవ్‌ గోమఠం చుట్టూ రాసుకున్న కామెడీ ట్రాక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ప్రతీ ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలన్న లక్ష్యంతో రూపొందించినట్లు కనిపిస్తుంది. అయితే సుజాత, సురేశ్‌ తమ కుటుంబాల గురించి ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్‌ క్రియేట్ చేస్తుంది. ఆ ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. కానీ, కామెడీ పేరుతో ఎలాంటి అసభ్యతకు చోటివ్వకుండా ఫ్యామిలీతో ఎంచక్కా చూసేలా దర్శకుడు ఈ మూవీని రూపొందించడం ప్రశంసనీయం. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. 

    సాంకేతికంగా 

    సాంకేతిక విభాగానికొస్తే.. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉంది. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • షాలిని, అభినవ్‌ గోమఠం నటన
    • కామెడీ సన్నివేశాలు

    మైనస్‌ పాయింట్స్‌

    • నెమ్మదిగా సాగే కథనం

    Telugu.yousay.tv Rating : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv