యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)కు మంచి నటుడిగానే కాదు.. మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా ఎంతో పేరుంది. తారక్ అనవసరంగా ఏ వివాదాలలోకి తలదూర్చడు. పైగా ఆడియో ఫంక్షన్లలో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ వారి క్షేమాన్ని ఆకాంక్షిస్తుంటారు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్‌కు కోపం వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు తారక్ ఎందుకు కోపడ్డాడు? కారణం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
తారక్‌కు కోపం వచ్చింది!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ కాంబోలో ‘వార్ 2’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబయిలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూ తారక్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో ముంబయిలోని ఓ హోటల్లో బస చేసేందుకు వెళ్తున్న తారక్‌ను ఫొటో గ్రాఫర్స్ ఫాలో అవుతూ అతడి అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయబోయారు. అది గమనించిన ఎన్టీఆర్‌కు కోపలు కట్టలు తెచ్చుకుంది. ఓయ్ అంటూ ఒక్కసారిగా కసురుకున్నాడు. ఆ సమయంలో తారక్.. షార్ట్ హెయిర్‌తో వైట్ షర్ట్ కళ్లద్దాలు ధరించి ఉన్నాడు.
కోపానికి కారణం ఇదే!
‘వార్ 2’ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇందులో తారక్ పాత్ర చాలా కీలకం కావడంతో ఆయన లుక్స్ రివీల్ చేయడానికి చిత్ర యూనిట్ సంసిద్ధంగా లేదు. కానీ, ఇటీవల షూటింగ్లో తారక్ లుక్స్‌కు సంబంధించిన విజువల్స్ బయటకొచ్చాయి. అవి జాతీయ స్థాయిలో వైరల్‌గా మారాయి. దీంతో ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని మేకర్స్ యూనిట్ మెుత్తానికి సూచించారట. ఈ క్రమంలోనే తారక్ కెమెరాలకు చిక్కకుండా త్వరగా హోటల్లోకి వెళ్తుండగా వెంటపడి మరి ఫొటోలు తీయడం ఆయన కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందుకే అతడు ఫొటోగ్రాఫర్లను విసుక్కున్నాడని అంటున్నారు.
‘వార్ 2’ కథ అదేనా?
2019లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘వార్’ (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటించగా.. పార్ట్ 2లో తారక్ కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కథ ఇదేనంటూ ఇటీవల ఓ ప్లాట్ నెట్టింట వైరల్ అయ్యింది. దాని ప్రకారం ‘వార్ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు – కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. హృతిక్-తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నెవర్ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!