భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కొత్త ఒరవడిని సృష్టించాడు. మూస ధోరణి సీన్లు, రెగ్యులర్ స్క్రీన్‌ప్లేకు స్వస్థి చెప్పి తనదైన కొత్త తరహా మేకింగ్ స్టైల్‌ను అందరికీ పరిచయం చేశాడు. తన సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే సందీప్ రెడ్డి ‘యానిమల్’ (Animal)లో వైలెన్స్‌తో పాటు తండ్రి సెంటిమెంట్‌ను సైతం బాగా చూపించాడు. తన చిత్రాల్లో తండ్రి పాత్రలను ప్రాధాన్యత ఇచ్చే సందీప్ తల్లి రోల్స్‌ను అంతగా పట్టించుకోడన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణాన్ని వివరించారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘అమ్మను ఎదిరించాను’
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) రంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాల్లో తల్లి రోల్స్‌కు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడో వివరించాడు. తన అమ్మతో తాను చాలా చనువుగా ఉంటానని సందీప్ తెలిపారు. ఆమె తనను బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పారు. కెరీర్‌లో ముందుకెళ్లడానికి తన మదర్ చాలా సహకరించిందని, యాక్టింగ్ స్కూల్ ఫీజుల దగ్గర నుంచి అర్జున్ రెడ్డి ప్రొడక్షన్ వరకు ఎన్నో విషయాల్లో ఆమె సపోర్ట్ ఉందని చెప్పారు. అమ్మతో ఎక్కువ ఎటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఒక్కోసారి ఆమెను ఎదిరించిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పించారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ తల్లి- కుమారుడు సెంటిమెంట్‌తో సినిమా తీస్తే అది పాజిటివ్‌గా ఉంటుందని, అందులో హింసకు చోటుండదని చెప్పుకొచ్చాడు.
తండ్రి-కొడుకుల బాండింగ్ సూపర్బ్
సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన ‘యానిమల్’(Animal) చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో వైలెన్స్‌తో పాటు తండ్రీ, తనయుల మధ్య అనుబంధాన్ని సందీప్ చక్కగా చూపించాడు. యాక్షన్ & ఎమోషన్ డ్రామా ఫిల్మ్‌గా కళ్లకు కట్టాడు. ఇందులో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్‌కపూర్ తండ్రి పాత్రలో యాక్ట్ చేయగా రణ్‌బీర్ కపూర్ తనయుడిగా చేశాడు. బాబీదేవోల్ ప్రతి నాయకుడిగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానున్న విషయం తెలిసిందే.
మూడు విభిన్న లుక్స్‌తో..
యానిమల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌తో సందీప్ (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్ రూపొందించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. పోలీసు లుక్‌తో పాటు మరో రెండు లుక్స్‌లో ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతోంది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కనిపించిన తరహాలోనే మరో రెండు కొత్త లుక్స్‌లో ప్రభాస్ అలరించే అవకాశముందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబర్ ఎండింగ్‌లోపు సినిమాను లాంఛనంగా ప్రారంభించి 2025 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మెుదలు పెట్టాలని సందీప్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల చిత్ర నిర్మాత ప్రకటించారు. దీంతో మూవీ లాంచింగ్ కార్యక్రమం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భారీ బడ్జెట్‌తో..
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘స్పిరిట్’ నిలవనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!