అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా అఖిల్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. హ్యాండ్సమ్ లుక్, అద్భుతమైన ఫిజిక్ కలిగిన అఖిల్ ఇప్పటివరకూ హీరోగా ఐదు చిత్రాల్లో నటించాడు. అందులో ఒక్కటి కూడా బ్లాక్ బాస్టర్ కాలేదు. ఇది అఖిల్‌తో పాటు అక్కినేని ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రీసెంట్ చిత్రం ‘ఏజెంట్’ కూడా ఫ్లాప్ కావడంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టి అభిమానులకు గ్రాండ్ ట్రీట్ ఇవ్వాలని అఖిల్ పట్టుదలగా ఉన్నాడు. అయితే ఏజెంట్ వచ్చి ఏడాదిన్నర దాటినా అఖిల్ ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ నెక్ట్స్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ బయటకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.
పీరియాడికల్ డ్రామా!
అఖిల్ (Akkineni Akhil) తర్వాతి ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అతడి నెక్ట్స్ ఫిల్మ్ రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ (Murali Kishore) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన సైతం వస్తుందని చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సైతం ఇప్పటికే మెుదలైపోయినట్లు చెబుతున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
త్వరలో డబుల్ ట్రీట్!
పీరియాడికల్ యాక్షన్ డ్రామాతో పాటు అఖిల్‌కు సంబంధించి మరో ప్రాజెక్ట్ సైతం దాదాపుగా ఓకే అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ (Anil Kumar) ఈ మూవీని తెరకెక్కిస్తారని సమాచారం. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి వార్తలు బయటకు వచ్చాయి. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి అనిల్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీ అఖిల్‌కు విపరీతంగా నచ్చిందని, వెంటనే స్క్రిప్ట్ కూడా ఓకే చేశారని టాక్. ఈ నేపథ్యంలో అఖిల్ ఈ రెండు చిత్రాలను ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో అఖిల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పక్కా అంటూ ప్రచారం కూడా జరుగుతోంది.
అఖిల్ న్యూలుక్ గమనించారా?
అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మేకోవర్ అవుతున్నాడు. అతడు పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం తన లుక్‌ను మార్చుకున్నట్లు సమాచారం. రీసెంట్‌గా అఖిల్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌తో కనిపించాడు. SSMB 29 ప్రాజెక్ట్ కోసం మహేష్ మేకోవర్ అయిన తరహాలోనే అఖిల్ సైతం మారాడు. గతంతో పోలిస్తే కండలు సైతం బాగా పెంచాడు. మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేస్తున్నాడు. అఖిల్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌తోనైనా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
‘ఏజెంట్’ ఎక్కడ?
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). మలయాళ నటుడు మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాలతో గతేడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ సోనీలివ్ దక్కించుకుంది. గతేడాది మే 19 నుంచే స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి రాలేదు. ఓటీటీలోకి ఏజెంట్ రాక ఎప్పుడంటూ గతంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. త్వరలోనే స్ట్రీమింగ్ అంటూ పదే పదే సోనిలివ్ ఇప్పటికే చాలా సార్లు సోనిలివ్ చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. దీంతో ఏజెంట్ గురించి ఆలోచించడం కూడా మానేశారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం