రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సందర్భంగా iQOO తన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ఈ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు సెప్టెంబర్ 26 నుండి కొనుగోలు చేసుకోవచ్చు. iQOO Z9x 5G, Z9 Lite 5G, Z9s Pro 5G, Neo 9 Pro, iQOO 12 5G వంటి iQOO స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, iQOO TWS 1e ఇయర్‌బడ్స్ కూడా సేల్ సమయంలో తక్కువ ధరలకు లభించనున్నాయి.
ఈ తగ్గింపు ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. SBI క్రెడిట్, డెబిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని ఫోన్లు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకుని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. iQOO Z9 Lite, iQOO Z9 5G, మరియు iQOO Z7 Pro కోసం కిక్‌స్టార్టర్ డీల్స్ ప్రస్తుతం అమెజాన్‌లో లైవ్‌లో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో iQOO డిస్కౌంట్లను ఓసారి పరిశీలిస్తే..
iQOO Z9 Lite, 4GB + 128GB మోడల్ ప్రారంభ ధర 10,499 రూపాయలు కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ ఫోన్‌ను రుూ. 9,499 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇక iQOO Z9xను 4GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 12,999 రూపాయలు కాగా, 10,749 రూపాయలకు తీసుకోవచ్చు.
iQOO Z9s 5G, Z9s Pro 5G ఫోన్లపై ఆరు నెలల పాటు నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. iQOO Z9s 8GB + 128GB వేరియంట్ వాస్తవ ధర 19,999 రూపాయలు కాగా, సేల్ సమయంలో రూ.17,499 రూపాయలకే లభిస్తుంది. అదే విధంగా, iQOO Z9s Pro 8GB + 128GB వేరియంట్ ప్రారంభ ధర 24,999 రూపాయలు కాగా, సేల్ సమయంలో 21,999 రూపాయలకు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌పై అదనంగా రూ. 1,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
iQOO Neo 9 Pro ఫోన్‌కు కూడా ఆరు నెలల నో-కాస్ట్ EMI ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 35,999 రూపాయల వద్ద ఉండగా, సేల్ సమయంలో దీన్ని 31,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అదనంగా 2,000 రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
iQOO 12 5G(12GB + 256GB) స్మార్ట్ ఫొన్ గతేడాది డిసెంబర్‌లో రూ. 52,999 ధరతో విడుదలైంది. అయితే అమెజాన్ సేల్ సమయంలో 47,999 రూపాయలకే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇందులో కొనుగోలుదారులు తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. దీనికి అదనంగా రూ. 2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
మరోవైపు ఈ ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌లోకి విడుదలైన iQOO TWS 1e ఇయర్‌బడ్స్‌ను అమెజాన్ సేల్ సమయంలో రూ. 1,599 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర 1,899 రూపాయలు.