Amazon Great Indian Festival: అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్స్‌తో టాప్ 7 స్మార్ట్‌ఫోన్స్‌.. ధర ఎంతంటే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Amazon Great Indian Festival: అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్స్‌తో టాప్ 7 స్మార్ట్‌ఫోన్స్‌.. ధర ఎంతంటే!

    Amazon Great Indian Festival: అమెజాన్‌లో కళ్లుచెదిరే డిస్కౌంట్స్‌తో టాప్ 7 స్మార్ట్‌ఫోన్స్‌.. ధర ఎంతంటే!

    October 6, 2023

    ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్ మెగా సేల్‌కు సిద్ధమైంది. భారీ ఆఫర్లతో అక్టోబర్‌ 8 నుంచి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సీజన్‌ (Great Indian Festival)ను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ లభించనున్నాయి. మెుబైల్స్‌పై బెస్ట్ డీల్స్‌ అందనున్నాయి. కాబట్టి కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావించే వారికి అమెజాన్‌ సేల్‌ సదావకాశమని చెప్పవచ్చు. మరి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.  

    iPhone 13

    అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 13 (iPhone 13) రూ. 40,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. గత నెలలో ఐఫోన్ 15 లాంచ్ తర్వాత యాపిల్ కంపెనీ అధికారికంగా ఐఫోన్ 13 ధరను రూ. 59,999కి తగ్గించింది. ఐఫోన్ 13ని రూ. 40 వేల కంటే తక్కువకు పొందాలంటే SBI బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించాలి. అలాగే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌ చేసి రూ. 39,999కే ఐఫోన్ 13 పొందవచ్చు.

    OnePlus Nord CE 3 Lite 5G

    వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ (OnePlus Nord CE 3 Lite) స్మార్ట్‌ఫోన్‌ను ఈ మెగా సేల్‌లో రూ.2,500 డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ అసలు ధర రూ.19999. అయితే అమెజాన్ స్పెషల్ సేల్‌లో ఈ కొత్త ఫోన్‌ను కొనేవారు రూ.1,000 కూపన్ డిస్కౌంట్ పొందవచ్చు. చెకవుట్ వద్ద కూపన్‌ అప్లై చేసి, రూ.1,000 డిస్కౌంట్‌తో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఫోన్ ఫైనల్ ధర రూ.17,499కి తగ్గుతుంది.

    OnePlus 11R 5G

    ఈ మెుబైల్‌ కూడా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. దీని అసలు ధర రూ.45,999 కాగా, అమెజాన్‌ దీన్ని అన్ని ఆఫర్లు పోనూ రూ.34,999 అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్.. 6.7 అంగుళాల స్క్రీన్‌, Android 13 OS, 50MP + 8MP రియర్ కెమెరా సెటప్‌, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

    Redmi 12 5G

    రెడ్‌మీ 12 5జీ మెుబైల్‌.. అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో రానుంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.15999. కానీ అమెజాన్‌ దీన్ని రూ.11,499 అందించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ 6.79 అంగుళాల FHD స్క్రీన్‌ కలిగి ఉంది. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, Android 13 OS ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    Samsung Galaxy M34 5G

    శాంసంగ్‌ మెుబైల్స్‌ సైతం అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో తక్కువ ధరకే లభించనున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy M34 5G మెుబైల్‌ భారీ డిస్కౌంట్‌తో రానుంది. ఈ ఫోన్‌ రూ.14,999 లభించనున్నట్లు తెలిసింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.24999 కావడం గమనార్హం. ఈ మెుబైల్‌ 6.5 అంగుళాల స్క్రీన్‌, 50MP + 8MP + 2MP ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 6000mAh బ్యాటరీ, Corning Gorilla Glass 5 స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

    OnePlus Nord CE 3 5G

    అమెజాన్ సేల్‌ బెస్ట్‌ డీల్స్‌ జాబితాలో OnePlus Nord CE 3 5G స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. ఈ మెుబైల్‌ ప్రారంభ ధర రూ.26,999. కానీ ఈ మెగా సేల్‌లో రూ.22,999కే దీన్ని పొందవచ్చు. ఈ మెుబైల్‌ 6.7 అంగుళాల స్క్రీన్‌, 120 Hz రిఫ్రెష్ రేటు,  Android 13.1 OS, 50MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 

    realme narzo 60X 5G

    అమెజాన్‌లో సేల్‌లో realme narzo 60X 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. రూ.14,999 గల ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ.11,999 పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 50 MP AI కెమెరాను, 5000mAh బ్యాటరీ, 6nm ప్రొసెస్‌ చిప్‌సెట్,  సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఫీచర్లను కలిగి ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version