Anant weds Radhika: ఒక్క లుక్‌తో టోటల్‌ సోషల్ మీడియా వరల్డ్‌ను షేక్‌ చేసిన మహేష్ బాబు.. ఎలా అంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Anant weds Radhika: ఒక్క లుక్‌తో టోటల్‌ సోషల్ మీడియా వరల్డ్‌ను షేక్‌ చేసిన మహేష్ బాబు.. ఎలా అంటే?

    Anant weds Radhika: ఒక్క లుక్‌తో టోటల్‌ సోషల్ మీడియా వరల్డ్‌ను షేక్‌ చేసిన మహేష్ బాబు.. ఎలా అంటే?

    July 13, 2024

    రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) – రాధిక మర్చంట్‌ (Radhika Merchant) పెళ్లి వేడుక శుక్రవారం (జులై 12) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక‌కు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అందరిలో కెల్లా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ వేడుకలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. తన క్రేజీ లుక్స్‌తో అందరినీ మెస్మరైజ్‌ చేశాడు.

    అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు భార్య నమ్రత (Namrata), కూతురు సితార (Sitara)తో సహా మహేష్‌ హాజరయ్యారు. బ్లాక్‌ కలర్‌ ట్రెడిషనల్‌ ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చాడు. షార్ట్‌ బియర్డ్‌ లాంగ్‌ హెయిర్‌తో మరింత హ్యాండ్సమ్‌గా కనిపించారు. దీంతో సోషల్‌ మీడియా అంతటా మహేష్‌ లుక్స్‌ గురించే చర్చ సాగుతోంది.

    దేశంలోని మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరోల్లో మహేష్‌ కచ్చితంగా ‘టాప్‌ 3’ ఉంటారు. అటువంటి మహేష్‌ లుక్‌ గురించి ఈసారి పెద్ద ఎత్తున వైరల్‌ కావడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం అతడు రాజమౌళితో ‘SSMB29‘ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాకు అనుగుణంగా తన లుక్‌ను మేకోవర్‌ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అంబానీ ఈవెంట్‌లో మహేష్‌ సరికొత్త లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ లుక్‌ రాజమౌళి సినిమా కోసమేని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. నిజాం నవాబులాగా మహేష్ ఉన్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. 

    మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆయన రాగానే అక్కడి వారు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. చరణ్ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లిలో పాల్గొన్నారు.

    అనంత్‌ – రాధికా వివాహా వేడుకలో రజనీకాంత్‌ సైతం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేసి అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది. ఓ ఈవెంట్‌లో తలైవా ఇలా డ్యాన్స్‌ చేయడం తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

    టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా పెళ్లి వేడుకలో సందడి చేశారు. వైట్ కలర్ షేర్వాణీ ధరించి ట్రెడిషనల్ లుక్‍లో వివాహానికి హాజరయ్యారు.

    టాలీవుడ్ హల్క్‌గా పేరున్న హీరో దగ్గుబాటి రానా కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. భార్య మిహికాతో కలిసి అనంత్ అంబానీ – రాధికా మెర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. 

    యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్లాక్ కలర్ ఔట్‍ఫిట్‍లో ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. లాంగ్ హెయిర్‌లో స్టైలిష్ లుక్‍తో కనిపించారు. అయితే అఖిల్‌ లుక్‌ మహేష్‌బాబుకు దగ్గరగా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. 

    సౌత్ ఇండియన్‌ స్టార్‌ సూర్య దంపతులు కూడా అంబానీ ఇంట వేడకకు హాజరయ్యారు. సూర్య పంచకట్టులో సంప్రదాయ బద్దంగా కనిపించారు. భార్య జ్యోతిక సైతం చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version