• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గొడవపడ్డ రాయుడు-జాక్సన్

    సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అంబటి రాయుడు-షెల్డన్ జాక్సన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా అంబటి రాయుడు బరోడా తరఫున, షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నారు. షెల్డన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాయుడు ఏదో అనగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఆటగాళ్లు, అంపైర్లు కలగజేసుకుని వారిద్దరినీ శాంతపరిచారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. pic.twitter.com/twhRAM0o2Y — cricket fan (@cricketfanvideo) October 12, … Read more

    కుక్క పిల్లతో బుడ్డోడి ఫుట్‌బాల్

    కుక్క పిల్లతో ఓ బుడ్డోడు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బుడ్డోడు బంతిని తన్నగానే కుక్క పిల్ల కూడా వెంటనే స్పందిస్తోంది. బంతిని తన తలతో కొడుతూ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఒకవైపు ఆ బాలుడు బంతిని తన్నుతుంటే మరోవైపు ఆ శునకం తలతో బంతిని కొడుతోంది. ఇదంతా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. https://twitter.com/buitengebieden/status/1579552188862693378?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579552188862693378%7Ctwgr%5Ec87e0cc4a61c8dd1da5da3a06a61233f4783b189%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fthis-video-of-little-boy-playing-football-with-dog-is-the-cutest-thing-on-internet-today-3423820

    భలే.. భలే.. భారీ గుమ్మడి

    మామూలుగా గుమ్మడి కాయ బరువు 5 లేదా 10 కిలోలు ఉంటుంది. కానీ అమెరికాలో ఒక గుమ్మడిపండు ఏకంగా 1,161 కిలోలు ఉంది. దీనిని హార్టికల్చర్ టీచర్ ట్రావిస్ జింజర్ పండించాడు. హఫ్ మూన్ బే నగరంలో ప్రపంచస్థాయి గుమ్మడికాయల పోటీ జరిగింది. ఈ పోటీల్లో అతిపెద్ద గుమ్మడికాయ 2,560 పౌండ్లు (1,161 కిలోలు) తూగి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని మిన్నేసోటా నుంచి 35 గంటల పాటు ప్రయాణం చేసి హాఫ్ మూన్ బేకు తీసుకువచ్చారు. విజేత ట్రావిస్‌ దాదాపు రూ.14 లక్షల … Read more

    చేతి పంపులో నీళ్లకు బదులు మద్యం

    సాధారణంగా చేతి పంపు కొట్టగానే నీళ్లు వస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో మాత్రం చేతి పంపు కొడితే మద్యం వస్తోంది. అసలు విషయమేంటంటే నాటుసారా నియంత్రణకు అక్కడి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామ పొలంలో చేతిపంపు అనుమానాస్పదంగా కనిపించింది. దానిని కొట్టి చూడగా మద్యం పైకి ఉబికి వచ్చింది. దాని పరిసరాల్లో తవ్వి చూడగా 7 అడుగుల లోతున ట్యాంకర్ ఏర్పాటు చేసి దానికి చేతి పంపు బిగించారు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు నాటుసారా … Read more

    పానీపూరి తిన్న ఏనుగు.. ఎక్కడంటే?

    అసోంలోని తేజ్‌పుర్‌లో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఏనుగు పానీపూరీ తింటుండగా కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పానీపూరి బండి వద్దకు ఏనుగును మావటి వాడు తీసుకొచ్చాడు. బండి యజమాని ఒక్కొక్క పానీపూరిని ఏనుగుకు అందించగా.. తొండంతో తినేసింది. ఇలా తింటుండటం చూసి అక్కడి స్థానికులు కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు. గతంలో కోతి ఐస్‌క్రీం తినడం, శునకం కూల్‌డ్రింక్ తాగడం వంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. गजराज को गोल गप्पे पसंद हैं A video … Read more

    రాహుల్ గాంధీ ‘పుష్ అప్’ ఛాలెంజ్

    రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ‘పుష్ అప్’ ఛాలెంజ్‌లో పాల్గొని రాహుల్ గాంధీ మెప్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, శివకుమార్, స్థానిక యువకుడితో కలిసి రాహుల్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ ఒక్కరే సరైన పుష్ అప్స్ తీశారు. మిగతావారు సగం సగం’ అని కామెంట్ చేశారు. కాగా, … Read more

    ఎమోషనల్ అయిన త్రివిక్రమ్

    త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వే.. నువ్వే’ ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తనకు తొలి అవకాశమిచ్చిన స్రవంతి రవికిశోర్‌ని ఎన్నటికీ మరచిపోనని.. ఆయన పాదాలకు త్రివిక్రమ్ అభివందనం చేశారు. తన మాటలను శ్రద్ధగా వినే ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టమని మాటల మాంత్రికుడు అభిప్రాయపడ్డారు.

    జిమ్‌లో యువతుల బాహాబాహీ

    జిమ్‌లో ఇద్దరు మహిళలు కొట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ [వీడియో](url)లో.. జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ వద్ద ఒక యువతి తన వంతు కోసం ఎదురు చూస్తుంటుంది. అదే సమయంలో మరో మహిళ అక్కడికొస్తుంది. ముందునుంచీ వెయిట్ చేస్తున్న యువతిని అప్పుడే వచ్చిన మహిళ పక్కకు నెట్టేస్తుంది. దీంతో ఆ యువతి కూడా తగ్గేదేలే అన్నట్లు తిరగబడుతుంది. ఒకరినొకరు జట్లు పట్టుకుని పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. వారిని విడదీయటానికి పక్కన ఉన్న వారు తెగ శ్రమించాల్సి వచ్చింది. https://twitter.com/Baharkekalesh/status/1579022442219311104?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1579022442219311104%7Ctwgr%5Eae9af34f6ddde2d84461f8b51502175eb5360da0%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fwomen-pull-each-others-hair-over-argument-in-gym-catfight-caught-on-cctv-watch-viral-video-au60-799373.html

    గువాహతిలో వరద భీభత్సం

    అస్సాం రాజధాని గువాహతిలో వరద భీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో గువాహతిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రుక్మిణీగావ్, హాతీగావ్‌ ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు నిలిచింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి. #WATCH | Assam: Several areas in Guwahati city face severe waterlogging and flood-like situation due to heavy rainfall … Read more

    ‘మోదీ యుగం స్వర్ణయుగం’

    సాంస్కృతిక పునరుజ్జీవనానికి మోదీ యుగం స్వర్ణయుగం లాంటిదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్‌లో తెలిపారు. కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం, కాశీ విశ్వనాథ్ ఆలయం, ఉజ్జయినీ మహంకాళీ ఆలయాలకు మోదీ హయాంలోనే పునరుజ్జీవనం వచ్చినట్లు సంజయ్ అభిప్రాయపడ్డారు. పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంలో మోదీ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. పర్యాటక రంగానికి బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు.[ వీడియో](url) కోసం వాచ్ ఆన్ బటన్‌పై నొక్కండి A Golden era for Cultural rejuvenation under leadership of Hon'ble PM … Read more