• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చేతి పంపులో నీళ్లకు బదులు మద్యం

    సాధారణంగా చేతి పంపు కొట్టగానే నీళ్లు వస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో మాత్రం చేతి పంపు కొడితే మద్యం వస్తోంది. అసలు విషయమేంటంటే నాటుసారా నియంత్రణకు అక్కడి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామ పొలంలో చేతిపంపు అనుమానాస్పదంగా కనిపించింది. దానిని కొట్టి చూడగా మద్యం పైకి ఉబికి వచ్చింది. దాని పరిసరాల్లో తవ్వి చూడగా 7 అడుగుల లోతున ట్యాంకర్ ఏర్పాటు చేసి దానికి చేతి పంపు బిగించారు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు నాటుసారా సరఫరా చేస్తున్నారు. దీనిని గుర్తించిన పోలీసులు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశారు.[ వీడియో](url) కోసం వాచ్ ఆన్ బటన్‌పై నొక్కండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv