• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్‌

    మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 70 స్థానాలకు నేడు రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మధ్యప్రదేశ్‌లో ఎస్టీ రిజర్వుడు సీట్లు 47, ఎస్సీ రిజర్వుడు 35 ఉన్నాయి. ఛతీస్‌గఢ్‌లో ఈ నెల 7న 20 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్‌ జరిగింది.

    బాధితుడి కాళ్లు కడిగిన సీఎం

    మధ్యప్రదేశ్‌లో దళితుడిపై మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. దీంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. బాధితుడు దష్‌మత్‌ రావత్‌ను కలిసిన సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అతడి కాళ్లు కడిగారు. బాధిత దళితుడికి శాలువ కప్పి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అంతేగా దష్‌మత్‌తో కలిసి సీఎం మెుక్కను నాటారు. మరోవైపు నిందితుడ్ని నిన్ననే అరెస్టు చేసిన పోలీసులు అక్రమ కట్టడం పేరుతో అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. #WATCH | … Read more

    జిమ్‌లో వ్యక్తి హఠాన్మరణం.. వీడియో వైరల్

    [VIDEO:](url) జిమ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరో వ్యక్తి మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతి చెందిన వ్యక్తిని హోటల్ యజమానిగా గుర్తించారు. ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేసిన అనంతరం మెరుగైన శ్వాస కోసం ఆ వ్యక్తి అక్కడినుంచి కదిలాడు. బాగా చెమటలు పట్టడంతో జాకెట్‌ని విప్పాడు. ఆసరా కోసం అక్కడున్న వస్తువును పట్టుకుందామని ప్రయత్నించేలోపే కూలిపోయాడు. హుటాహుటిన ఆ వ్యక్తిని జిమ్‌లో ఉన్న ఇతర యువకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ … Read more

    ‘మందు తాగండి.. నీటిని మిగల్చండి’

    వివాదాస్పద వ్యాఖ్యలతో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆ రాష్ట్ర ఎంపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నీటిని సంరక్షించాలంటే వినియోగాన్ని తగ్గించాలని చెబుతూనే.. దానికి బదులుగా మద్యం సేవించాలని ఎంపీ జనార్ధన్ మిశ్రా సూచించారు. ‘నీళ్లు లేక భూములు వట్టిపోతున్నాయి. నీటిని సంరక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అవసరమైతే మందు తాగండి. ధూమపానం చేయండి. ఏదైనా కానివ్వండి. కానీ, నీటిని మాత్రం వృథా చేయొద్దు. జల ప్రాముఖ్యతను ఇప్పటికైనా గుర్తించండి’ అంటూ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ … Read more

    పాట పాడిన ముఖ్యమంత్రి

    కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను మధ్యప్రదేశ్ సీఎం ఉల్లాసపరిచారు. తన ఇంటికి ఆహ్వానించి దీపావళి సంబరాలు జరుపుకొన్నారు. ఈ వేడుకలో సుమారు 300కు పైగా చిన్నారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వారికి సహంపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా కొందరు చిన్నారులకు తినిపించారు. అనంతరం కచేరిలో పాల్గొని పాటలు పాడారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. मेरे बच्चों, यदि हम हताश होकर बैठेंगे, यह तो जिंदगी बोझ … Read more

    VIRAL: బాలుడిని వేలాడదీసిన వ్యక్తి

    సెల్‌ఫోన్ దొంగలించాడని ఓ బాలుడిని బావికి వేలాడదీసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. తనకు ఏం తెలియదని.. ఆ దొంగతనం చేయలేదని బాలుడు ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. పైగా, ‘నిజం చెప్తావా.. బావిలో తోసేయ్యనా’ అంటూ ఓ వ్యక్తి బాలుడిని బెదిరిస్తున్న వీడియో వైరల్ అయింది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి.. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వీడియో తీసినందుకు పోలీసులు తనను బెదిరించారని మరో అబ్బాయి ఆరోపించగా.. అదేమీ లేదని పోలీసులు ఖండించారు. Video: Madhya Pradesh Boy … Read more

    ‘మా అమ్మను అరెస్ట్ చేయండి’

    తన చాక్లెట్లను అమ్మ దొంగలిస్తోందని.. ఆమెను అరెస్టు చేయాలని మూడేళ్ల బుడతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననివ్వట్లేదని.. అడిగితే కొడుతుందని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు బాలుడికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు.తల్లిపై ఫిర్యాదు చేయడానికి ఆ బాలుడు తన తండ్రిని వెంట తీసుకెళ్లడం చర్చనీంయాంశం. సరదాగే ఇలా చేసి ఉంటుందని బుడతడి నాన్న మీడియాతో చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की … Read more

    చేతి పంపులో నీళ్లకు బదులు మద్యం

    సాధారణంగా చేతి పంపు కొట్టగానే నీళ్లు వస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో మాత్రం చేతి పంపు కొడితే మద్యం వస్తోంది. అసలు విషయమేంటంటే నాటుసారా నియంత్రణకు అక్కడి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామ పొలంలో చేతిపంపు అనుమానాస్పదంగా కనిపించింది. దానిని కొట్టి చూడగా మద్యం పైకి ఉబికి వచ్చింది. దాని పరిసరాల్లో తవ్వి చూడగా 7 అడుగుల లోతున ట్యాంకర్ ఏర్పాటు చేసి దానికి చేతి పంపు బిగించారు. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకు నాటుసారా … Read more

    కొడుకును ఎత్తుకొని రిక్షా న‌డుపుతున్న తండ్రి..వైర‌ల్ వీడియో

    మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్‌లో రాజేశ్ అనే ఒక వ్య‌క్తి త‌న కొడుకును ఎత్తుకొని రిక్షా న‌డుపుతున్నాడు. కొంత‌కాలం క్రితం అత‌ని భార్య వారిని వ‌దిలేసి వేరే వ్య‌క్తితో వెళ్లిపోయింది. దీంతో మూడేళ్ల పాప‌, ఏడాది బాలుడి బాధ్య‌త తండ్రిపై ప‌డింది. పాప‌ను ఇంటిద‌గ్గ‌రే వ‌దిలేసి బాబును ఎత్తుకొని రోజూ రిక్షా తొక్కుతూ వారిని పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌నకు ప్ర‌భుత్వం ఏదైనా సాయం చేయాల‌ని రాజేష్ కోరుకుంటున్నాడు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను కంట‌త‌డి పెట్టిస్తుంది.

    వీడియో: టోల్ ట్యాక్స్ అడిగినందుకు యువతి చెంపపై కొట్టిన వ్యక్తి

    టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వెళ్లనివ్వమని చెప్పడంతో ఓ వ్యక్తి అక్కడి మహిళా సిబ్బంది చెంపపై కొట్టాడు. దీంతో ఆ యువతి అతనిపై చెప్పుతో దాడి చేసింది. ఆ క్రమంలో వారిద్దరు కొట్టుకున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్‌గఢ్ భోపాల్ రోడ్డులోని కచ్నారియా టోల్ ప్లాజా వద్ద జరిగింది.