• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సీఎంపై మండిపడ్డ కిషన్ రెడ్డి

    కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలైన ఫాసిస్ట్ కేసీఆర్ యేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో అన్ పార్లమెంటరీ పదాలను వాడుతున్నారన్నారని గుర్తుచేశారు. ఈటెల రాజేందర్ ని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సీఎంగా తొలుత కేసీఆర్ ఆదర్శంగా మాట్లాడాలని హితవు పలికారు. మోదీని గద్దె దించడం కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న ఎంపీ సీట్లను కూడా ప్రజలు ఊడ్చేస్తారని జోష్యం చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ ని పాటించట్లేదని విమర్శించారు.

    మంత్రి సబితపై రాజగోపాల్‌ ఫైర్

    ఉస్మానియా వర్సిటీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. హాస్టల్‌లో భోజనం, తాగునీరు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేసిన వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పలు ప్రశ్నలు వేశారు. అన్నం గడ్డలు గడ్డలుగా ఉంటుందని, కూరల్లో గాజుపెంకులు వస్తున్నాయని, ఈ భోజనమే మీ సీఎం మనవడు కూడా తింటాడా అని సబితను ప్రశ్నించారు. వీడియో కోసం వాచ్ఆన్ పై నొక్కండి అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన … Read more

    కారు దిగి పరుగెత్తిన వైద్యుడు

    పేషంట్ ప్రాణాల్ని కాపాడటానికి ఓ వైద్యుడు చేసిన సాహసం ఔరా అనిపిస్తోంది. బెంగుళూరులో ఓ రోగికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. డాక్టర్ నందకుమార్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. అది క్లియర్ కావటానికి చాలా సమయం పడుతుందని గ్రహించిన వైద్యుడు.. కారు దిగి పరుగెత్తడం ప్రారంభించారు. ఇలా మూడు కిలోమీటర్లు పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆయనే పంచుకుంటూ.. ‘ఉద్యోగం చేయాలంటే కొన్నిసార్లు పరుగెత్తాలి’ అని ట్వీట్ చేశాడు. వైద్యుడి ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మరి మీరేమంటారు? @BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better … Read more

    మోటార్లకు మీటర్లు పెట్టమనలేదు: ఎమ్మెల్యే

    విద్యుత్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు చర్చించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా బిల్లులో లేదని ఆయన స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పే ఆలోచన తమ పార్టీకి లేదని రఘునందన్ చెప్పారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రం చెప్పలేదన్నారు. రాష్ట్రం అందించే సబ్సిడీలను కేంద్రం ఎత్తేయాలన్న ఆరోపణ తప్పని ఎమ్మెల్యే చెప్పారు. అంతకుముందు ఈ బిల్లుపై బాల్క సుమన్ చర్చకు లేవనెత్తారు.

    ఆర్టీసీని అమ్మితే రూ.1000 కోట్లు నజరానా

    సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాసిందని ఆయన స్పీకర్ తో అన్నారు. త్వరగా అమ్మినవారికి రూ.1000 కోట్ల నజరానా కూడా అందజేస్తామని కేంద్రం తెలిపినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ రాసిన లేఖలను చూపించారు. దేశం మొత్తాన్ని అమ్మేయాలని కేంద్రప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Government of India is writing letters asking to sell Telangana RTC, who will … Read more

    చెప్పులు విడిచి నివాళులు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. అయితే, రెబల్ స్టార్ భౌతికకాయంపై పుష్పాంజలి ఘటించే ముందు చెప్పులు విడిచారు. ఈ ఒక్క ఘటనతో తన సంస్కారం ఎంత పెద్దదో నిరూపితమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నివాళులర్పించిన అనంతరం ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ మాట్లాడించారు. తాజాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం Watch On ట్విటర్ పై క్లిక్ చేయండి. Cheppulu pakka vadhilesi Nivalulu arpincharu respect Sir ?? Thanks @PawanKalyan garu for … Read more

    ఆర్జీవీ వరుస ట్వీట్లు.. వైరల్

    రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఆర్జీవీ మరోరకంగా స్పందించారు. ఒక మహానటుడు చనిపోతే.. షూటింగ్ లు నిలిపివేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. రేప్పొద్దున ఇదే దుస్థితి నేటి తరం నటులకు ప్రాప్తిస్తుందని ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు. గొప్ప కళాకారుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. కృష్ణంరాజు వంటి పెద్దవాళ్లకి విలువనిద్దామని.. షూటింగులు రెండు రోజులు నిలుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, @urstrulyMahesh @PawanKalyan @KChiruTweets @themohanbabu బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం … Read more

    ‘పుష్ప’గా రణ్ వీర్ సింగ్

    బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ పుష్పరాజ్ గా మారిపోయాడు. తగ్గేదేలే అంటూ స్టైల్ గా యాక్షన్ చేసి చూపించాడు. సైమా ఈవెంట్ లో ఈ దృశ్యం చోటుచేసుకుంది. మోస్ట్ పాపులర్ హీరోగా రణ్ వీర్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ‘పుష్ప.. నీ అవ్వ తగ్గేదేలే’ అంటూ స్టేజిపై సీన్ ని రీక్రియేట్ చేశాడు. అక్కడే కూర్చున్న బన్నీ.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ‘సైమా’ అవార్డుల్లో పుష్ప సినిమా ప్రభంజనం సృష్టించింది. మరి ఈ చిత్రంలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్ … Read more

    విక్రమ్ గర్జనకు 100 రోజులు

    థియేటర్లో, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన సినిమా ‘విక్రమ్’. ఈ మూవీ విడుదలై 100రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. చిత్రాన్ని విజయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ని తమ్ముడిగా అభివర్ణిస్తూ ధన్యావాదాలు చెప్పారు. వాయిస్ నోట్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలపడం విశేషం. మ్యూజికల్ గా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద రూ.450కోట్లు కొల్లగొట్టింది. ఇందులో మీకు నచ్చిన డైలాగ్/సీన్ ఏంటో చెప్పండి. #100DaysofVikram #VikramRoaringSuccess pic.twitter.com/7SjZIpTB6M — Kamal … Read more

    అలా చేస్తే ‘సీతారామం’ మరోలా ఉండేది

    సీతారామం సినిమా తెలుగు, హిందీ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. క్లాస్ ప్రేక్షకులను మురిపించింది. ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానం చేశారు. పరుచూరి పాఠాల ద్వారా ఆయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అన్ని అంశాల్లో సినిమా చాలా బాగుందన్నారు. అయితే, విషాదంతంతో కాకుండా సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతంతో ముగిస్తే మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో కోసం Watch On క్లిక్ చేయండి.