• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబర్ కెప్టెన్సీ నుంచి దిగిపో: షోయబ్ మాలిక్

    భారత్‌ మ్యాచ్‌తో పాక్ ఘోర ఓటమి తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అజామ్ కెప్టెన్సీ నుంచి దిగిపోవడం మంచిదని అభిప్రాయపడ్డాడు. ‘బ్యాటర్‌గా అజామ్ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ వల్ల జట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అతడు కెప్టెన్నీ నుంచి వైదొలిగి బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే అని షోయబ్ చెప్పుకొచ్చా డు.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఫైబర్‌నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాది కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబను అరెస్టు చేయోద్దని సుప్రీం ఆదేశించింది.

    భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాప్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. అందుకే భారత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత్ ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చారు. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతడు ఎంత బలంగా మారాడో అర్థమైపోతుందని … Read more

    టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా vs నెదర్లాండ్స్ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత నెదర్లాండ్ బ్యాటింగ్‌కు దిగింది, గత మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించగా, నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

    అవినీతి అంతం కావాలి: అమిత్ షా

    బెంగాల్‌లో అవినీతి, దౌర్జన్యాలు త్వరలోనే అంతం కావాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నేడు ఆయన పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా షా మట్లాడుతూ.. బెంగాల్‌లో రాజకీయపరమైన మార్పు జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని పోలినట్లుగా కోల్‌కతాలో దుర్గమ్మ మండపాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అమిత్ షా ప్రశంసించారు.

    ఢిల్లీ లిక్కర్ కేసులో ‘ఆప్’ పేరు

    ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పేరును చేర్చే యోచనలో ఉన్నట్లు సీబీఐ, ఈడీ సుప్రీంకోర్టు కు తెలిపాయి. ఈ కేసులో సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై విచారణ సుప్రీంలో విచారణ జరిగింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్లు, నిబంధనల ప్రకారం.. ఆమ్‌ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని దర్యాప్తు సంస్థలు యోచిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు. దీనిపై వాదనలు విన్న సుప్రీం రేపు దీనిపై స్పష్టతనివ్వాలని సూచించింది. అనంతరం సిసోదియా బెయిల్‌ పిటిషన్లపై తదుపరి విచారణను రేపటికి … Read more

    రూ.3.04 కోట్లు హవాలా సొమ్ము స్వాధీనం

    నల్గొండ జిల్లా అక్రమంగా తరలిస్తున్న రూ.3.04 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 లక్షల విలువగల కారును సీజ్ చేశారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ ప్రాంతం మాడ్గులపల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీ ఈ డబ్బు పట్టబడింది. జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.7.39 కోట్ల నగదు, రూ.40 లక్షల విలువగల మద్యం రూ.1.71 కోట్ల విలువగల గంజాయి పట్టుబడింది.

    యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ షాక్‌

    నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు మరో షాక్‌ ఇవ్వనుంది. సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాస్‌వర్డ్-షేరింగ్‌ను కట్టడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ 6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హాలీవుడ్ నటీనటుల సమ్మె ముగిసిన తర్వాత ధరలను పెంచే అవకాశం ఉందని సమాచారం.

    AUSvsSL: ఆస్ట్రేలియా తొలి విజయం

    ప్రపంచ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లఖ్‌నవూ వేదికగా తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో 43.3 ఓవర్లకు 209 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌట్ అయింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (11), స్మిత్ (0) లాబుస్‌చగ్నే (58) జోష్ ఇంగ్లిస్ … Read more

    దశ దిశ మార్చే సమయమొచ్చింది: రేవంత్

    ఎన్నికల ద్వారా తెలంగాణ దశ దిశ మార్చే సమయమొచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. వికారాబాద్‌కు కృష్ణా జలాలు, ఎంఎంటీఎస్‌ రైలు రాకపోవడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారని తెలిపారు. ఉద్యోగ పరీక్ష జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.