• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SAvsNED: సౌతాఫ్రికా టార్గెట్ ఫిక్స్

    ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ బ్యాటర్లు విక్రమ్‌జిత్ సింగ్ (2), బాస్‌ డీ లీడే (2) సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (19), మాక్స్‌ ఔడౌడ్ (18), కోలిన్ అకెర్‌మాన్ (13) తేజ నిడమనూరు (20) స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులతో రాణించారు.

    బంగ్లాదేశ్‌కు భారీ షాక్

    వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆక్టోబర్‌ 19న పుణే వేదికగా బంగ్లాదేశ్‌ జట్టు టీమిండియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లా జట్టు కెప్టెన్‌ షకీబుల్‌ హసన్‌ గాయం కారణంగా భారత్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. షకీబ్‌ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.‌ గత న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షకీబ్‌ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. షకీబుల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

    దేశ శాస్త్రవేత్తలకు మోదీ దిశానిర్ధేశం

    భారత దేశ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగు పెట్టేలా లక్ష్యం పెట్టుకోవాలని దిశానిర్ధేశం చేశారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 విజయాలు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్ధేశించుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. శుక్రగ్రహంపై ఆర్భిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ వంటి ప్రయోగాల దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని మోదీ వెల్లడించారు.

    భార్యను చంపి భర్త ఆత్మహత్య

    HYD: నాగోలులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆపై భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబకలహాల కారణంగానే భర్త భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాంగ్రెస్‌తో పెను ప్రమాదం: కేసీఆర్

    సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలపై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారని మడిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోలు వచ్చి పెత్తనం చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ధరణి ఉండాలో?.. రద్దు కావాలో? రైతులే నిర్ణయించుకోవాలి కేసీఆర్ సూచించారు.

    బాణసంచా కేంద్రంలో పేలుడు..7 మంది మృతి

    తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. రంగపాళ్యంలోని ఓ కేంద్రంలో బాణసంచా గోదాములో జరిగిన పేలుళ్ల ఘటనలో ఏడుమంది మృతిచెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక సేవల సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసేశారు. మృతులంతా అక్కడే పనిచేసే కార్మికులు అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదాల్లో ఎంతమందికి గాయాలయ్యాయనే సమాచారం తెలియలేదు.

    పాక్ మాజీ కెప్టెన్ ఇంట్లో విషాదం

    పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నిఅఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ‘మా సోదరి మమ్మల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయి’. అని అఫ్రిది ట్వీట్ చేశారు.

    ‘భగవంత్ కేసరి’ తాజా అప్‌డేట్

    బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరికి సెన్సార్ లో ఒక్క కట్ కూడా చెప్పలేదు. దీనితో సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్‌కి పంపించారో అదే విధంగా జీరో కట్స్‌తో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. దీనితో ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ నెల 19న విడుదలకు … Read more

    తండ్రి నుంచి ఎంతో నేర్చుకున్నా: మహేష్‌బాబు

    సూపర్ స్టార్ మహేష్‌బాబు ఓ కార్యక్రమంలో తన తండ్రి దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకున్నారు. తాను నటించిన సినిమా ప్రేక్షకాదరణ పొందనప్పుడు ఎంతో నిరుత్సాహ పడతానని చెప్పారు. ‘ఎందుకంటే ఓ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. దాని వెనక ఎంతో మంది కష్టం ఉంటుంది. దాని పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను. అలాగే తర్వాతి సినిమాపై ఎక్కువ దృష్టి పెడతాను. ఈ విషయం నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. క్రమశిక్షణ, వినయం, వంటి ఎన్నో విషయాలు ఆయన నేర్పించారు’. అని మహేష్ తన … Read more

    ఇది గొప్ప ఆనందం: అల్లు అర్జున్

    69వ నేషనల్ అవార్డు 2023 కార్యక్రమంలో ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరుగుతోంది. జాతీయ ఉత్తమ నటుడిగా హీరో అల్లు అర్జున్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం పుష్పలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. దీనికి సబంధించిన మీడియాను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచున్నారు. NATIONAL AWARD WINNING BEST ACTOR Icon Star @alluarjun shares his excitement ahead of … Read more