• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    ఇజ్రాయెల్ పర్యటనకు బైడెన్

    రేపు ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా వైట్‌హౌస్ ప్రకటించింది. అనంతరం ఆయన జోర్డాన్‌కూ వెళ్లనున్నట్లు తెలిపింది. అక్కడ ఈజిప్ట్‌, పాలస్తీనా, జోర్డాన్‌ దేశాధినేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొంది. తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ మద్దతు ఇవ్వడమే బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే గాజాలోని మానవతా సంక్షోభ నివారణ గురించీ చర్చిస్తారని పేర్కొంది.

    ప్రజలకు నేనే సీఎం కావాలని ఉంది: జానారెడ్డి

    ప్రజల మనసులో తానే సీఎం కావాలని ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఏ పదవీ కోరుకోవట్లేదు. సీఎం అయ్యే అవకాశం హఠాత్తుగా రావచ్చేమో. ఏ పదవి వచ్చినా కాదు అనను 21 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చా మంత్రి గా అన్ని శాఖలను నిర్వహించా 36 ఏళ్లకే మంత్రిని అయ్యా. నాకు 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. నాకు ఏ పదవులైనా వాటంతట అవే వస్తాయి’’ అని జానారెడ్డి అన్నారు.

    టీడీపీ-జనసేన కార్యాచరణపై పవన్ చర్చ

    ఏపీలో రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ చెర్చించారు. ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ-జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశంపై పార్టీ నేతలతో పవన్ చర్చించారు. రైతుల ఇబ్బందులు సాగునీరందక కృష్ణా, పశ్చిమ డెల్టాలో 4లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై పవన్ చర్చించారు. రైతుల పక్షాన నిలవాలని, అందుకు చేపట్టే పోరాటంపై ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని పవన్ ఆరోపించారు.

    ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు

    తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు , రత్నాల వల్ల కలిగే వేడిని, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇనుమడింపజేసుకొని ఉత్సాహాన్ని, ప్రశాంతతను పొందుతారు.

    ‘లియో’ తెలుగు వెర్షన్‌ విడుదలపై క్లారిటీ

    ‘లియో’ చిత్రం తెలుగు వెర్షన్‌ విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, తెలుగు వెర్షన్‌ అదే రోజు విదుదలవుతుందని చెప్పారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. ‘లియో’ సినిమాలో హీరోయిన్ గా త్రిష, నటులు సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    విడుదలకు ముందే ‘లియో’ రికార్డులు

    విజయ్ హీరోగా నటించిన ‘లియో’చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు విడుదల దగ్గరపడుతుండడంతో రికార్డులను బ్రేక్ ,చేస్తోంది. ఓవర్సీస్‌లో లియో టికెట్ల సేల్స్ మిలియన్‌ మార్క్‌ను అవలీలగా చేరుకుంది. ఈ సినిమా విడుదల రెండు రోజుల ముందే ఓవర్సీస్‌లో దీని టికెట్లు వన్‌ మిలియన్‌ డాలర్లకు పైగా అమ్ముడయ్యాయి. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డును తాజాగా లియో అధిగమించింది. అక్కడ మొదటిరోజు 15000 టికెట్లు అమ్ముడయ్యాయి.

    బ్యాంకులకు RBI భారీ జరిమాన

    ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు భారీ జరిమనా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున పెనాల్టీ వేసింది. రుణాలు అడ్వాన్సులు-చట్టబద్ధమైన, ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్‌ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఈ జరిమానా విధించింది.

    దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌

    ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం చాలా కష్టమైన పని అని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్‌లు లబ్ధి పొందారని ఆదిత్యనాథ్‌ తెలిపారు.