• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియాను ఓడిస్తే డిన్నర్ డేట్‌కు వస్తా: పాక్ నటి

    గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పాక్ నటి సెహర్ షిన్వారి విషం చిమ్ముతూ సంచలన ప్రకటన చేసింది. రేపు జరగబోయ్ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే.. బంగ్లాదేశ్ ఆటగాడితో డిన్నర్ డేట్‌కు వెళ్తానని ప్రకటించింది. ‘భగవంతుడా భారత జట్టును బాంగ్లాదేశ్ ఓడిస్తే ఆ దేశ ఆటగాడితో ఢాకాకు వెళ్లి డిన్నర్ డేట్‌కు చేస్తా’ అని షిన్వారి ట్వీట్ చేసింది. ఈ నటి గతంలో కూడా వివాదాస్పద పోస్ట్‌లు చేసింది.

    చంద్రబాబు అరెస్టుపై నరేష్ స్పందన ఇదే?

    చంద్రబాబు అరెస్టుపై సినీ నటుడు నరేష్ స్పందించారు. చంద్రబాబు విషయంలో ధర్మం ఎప్పుడూ నిలబడుతుందన్నారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుందన్నారు. ఆ తిరుగుబాటు ఫలితం తప్పక వస్తుందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైల్లో ఉన్నారని. తర్వాత ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందని నరేష్ పేర్కొన్నారు.

    ఆసుపత్రిపై దాడి: మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

    గాజాలో ఆసుపత్రి దాడి ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్ అహ్లీ ఆసుపత్రిలో ప్రాణనష్టంపై బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న ఘర్షనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆసుపత్రిపై దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    ‘జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా’

    టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రన్న హయాంలో దసరా, దీపావళి, రంజాన్ వంటి ప్రముఖ పండుగలకు వారం ముందే జీతాలందుకున్న రోజుల నుంచి… జగనన్న పండగోస్తుంది మా జీతాలన్నా.. మమ్మల్ని కరుణించన్న అనే రోజులు వచ్చాయి….అమ్మో ఒకటో తేదీ..ఇది పాత మాట.. ఇప్పుడు ఆ తేదీనే మర్చిపోయిన రోజులు ఇవి..వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు పడిన సంఘటనలు అరుదులో అరుదు’ అని గంటా పేర్కొన్నారు.

    ఆ హీరో దారణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు

    హీరో శివకార్తికేయన్ తనను దారుణంగా మోసం చేశాడని సంగీత దర్శకుడు ఇమ్మాన్ ఆరోపించాడు. ఇక జీవితంలో అతడితో కలిసి పనిచేయనని తెగేసి చెప్పాడు. ‘నా వ్యక్తి గత కారణాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అతడు చేసిన మోసాన్ని తెలుసుకునే సరికి నాకు చాలా సమయం పట్టింది. అతడు ఏం చేశాడనేది ఇప్పుడు బయటపెట్టలేక పోతున్నా?. నాకు ఏం జరిగినా కారణం మాత్రం అతడే, శివకార్తికేయన్ ఇంతటి దారుణ మోసానికి పాల్పడతాడని అస్సలు అనుకోలేదు’. అని ఇమ్మాన్ ఆరోపణలు చేశాడు.

    ‘ఆ పార్టీలను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి’

    ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను గెలిపిస్తే రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమానికి బీజం పడింది. కొత్తగా రాష్ట్రం తెలంగాణను రెండు సార్లు కేసీఆర్ చేతిలో పెట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల్లో మార్పులు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వచ్చాయి. కరెంటు ఉంటుంది. మూడో సారి కూడా బీఆర్‌ఎస్ తప్పక గెలుస్తుంది’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

    దసరా సెలవుల్లో మార్పులు

    ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. ఈ నెల 24న హాలీడే బదులుగా సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ దృష్ణ్యా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

    దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలిండర్‌

    ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం చాలా కష్టమైన పని అని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్‌లు లబ్ధి పొందారని ఆదిత్యనాథ్‌ తెలిపారు.

    TS Elections: పట్టుబడ్డ నగదు ఎంతో తెలుసా?

    తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి డబ్బు, మద్యం, ఆభరణాలు, విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు రూ.21,84,92,242 విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71 కోట్లకు పైగా నగదు, 52,091 లీటర్ల మద్యం, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మొత్తం రూ.7,55,79,917. రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు.

    సౌతాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్స్

    పసికూన నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌ మొదట్లో తడబడినా తర్వాత బాగానే పరుగులు రాబట్టింది. స్కాట్ ఎడ్వర్డ్స్ (78) పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు గట్టిసవాల్‌ విసిరిరాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు నెదర్లాండ్స్ స్పిన్ దాటికి నిలవలేకపోయారు. సౌతాఫ్రికా 42.5 ఓవర్లకు ఆలౌటై 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో … Read more