• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

    కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులకు, రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు డీఏను 4 శాతం, రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లింపులకు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుల విషయానికి వస్తే గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో చర్చలు జరిగాయి,

    బీజేపీ జాబితాలో నా పేరు ఉంటుంది!: రాజాసింగ్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించబోయే లిస్ట్‌లో తన పేరు ఉంటుంది పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీజేపీ తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్‌ సర్కారు వస్తుందని అభిప్రాయపడ్డారు.

    కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఫైర్

    తెలంగాణలో దొరల పాలన సాగుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.. నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్‌ గతంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తెలంగాణలో కూడా నెరవేరుస్తామని రాహుల్‌ గాంధీ అన్నారు.

    అఫ్గాన్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

    ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతూ చివరకు ఆలౌల్ అయింది. 34.4 ఓవర్లలో 10 వికెట్లను కోల్పోయి 139 పరుగులే మాత్రమే చేయగలిగింది. అఫ్గాన్ బ్యాటర్లు ఎవరూ 50కి పైగా పరుగులు రాబట్టలేక పోయారు.

    నారా భువనేశ్వరి కీలక నిర్ణయం

    చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. అలాగే చంద్రబాబు నిర్వహిస్తున్న భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రారంభిస్తారు.

    విడుదలకు ముందు ‘లియో’కి షాక్

    విజయ్‌ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతలకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సినిమా మొదటి రోజు ఉదయం 4గంటల షోకు అనుమతించాలని ప్రభుత్వాన్ని చిత్ర బృందం కోరింది. అయితే వారి అభ్యర్థనను ప్రభుత్వం నిరాకరించింది. అలాగే ఉదయం 7గంటల షోను కూడా రద్దు చేసింది. అక్టోబర్‌ 19 ఉదయం 9నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

    అందుకే రెండో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నా: రేణూ

    తన రెండో పెళ్లిపై నటి రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై రేణూ క్లారిటీ ఇస్తూ. ‘రెండో పెళ్లిని ఇంట్లో పెద్దలు కుదిర్చారు. అప్పుడు మా అమ్మాయికి 7 ఏళ్లు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పాపకు సరిగా సమయం కేటాయిస్తానో.. లేదో అనిపించింది. అందుకే క్యాన్సిల్‌ చేసుకున్నా. ఆద్యకు ఇప్పుడు 13ఏళ్లు. తను ఇంకాస్త పెద్ద అయ్యాక నా రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటా’ … Read more

    కాంగ్రెస్ 6 క్యారెంటీ కార్టులకు పూజలు

    నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. ముందుగా పాలంపేటలోని పార్టీ సీనియర్ నేతలతో కలిసి రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్టులను రామప్ప స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.

    NZvsAFG: అఫ్గనిస్తాన్ టార్గెట్ ఫిక్స్

    ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 288 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (20), విల్ యంగ్ (54), రచిన్ రవీంద్ర (32), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (68), గ్లెన్ ఫిలిప్స్ (71), మార్క్ చాప్మన్ (25) పరుగులతో రాణించారు. ఇక అఫ్గాన్ బౌలర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్ (2), రషీద్ ఖాన్ (1), ముజీబ్ ఉర్ రహ్మాన్ … Read more

    దడ పుట్టిస్తోన్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్

    ఆదిలాబాద్‌ జిల్లాలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ దడ పుట్టిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 104 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని బాధితులు 10 రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా ఈ వైరస్ సోకుతోంది.