• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలు

    గాజాలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. . ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి మృతదేహాలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. దీంతో ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గజాలో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 2,600 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాల్చేందుకు శ్మశానవాటికల్లోనూ స్థలం సరిపోకపోవడం లేదు.

    ఐటీశాఖ రూ.102 కోట్లు స్వాధీనం

    ఏపీ, తెలంగాణ, కర్ణాటక, దిల్లీలో సోదాలపై ఐటీశాఖ వివరణ ఇచ్చింది. మొత్తం 55 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. గుత్తేదారులు, స్థిరాస్తి వ్యాపారుల నివాసాల్లో సోదాలు చేసినట్లు చెప్పింది. ట్యాక్స్ కట్టని రూ.102 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఐటీశాఖ తెలిపింది. ఇందులో 94 కోట్ల విలువైన నగదు, రూ.8కోట్ల విలువైన బంగారు నగలు ఉన్నట్లు పేర్కొంది.

    ఆ తప్పు మళ్లీ జరగకూడదు: సినీ నిర్మాత

    ఎజెంట్, భోళా శంకర్ చిత్రాల నిర్మాత అనీల్ సుంకర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల ఆయన నిర్మించిన చిత్రం ఊరు పేరు భైరవకోన మూవీ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇస్తు ట్వీట్ చేశారు. ‘మేం ఖరీదైన తప్పులు చేశాం అందుకే ఎజెంట్, భోళా శంకర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదని ప్రయత్నిస్తున్నాం. అలానే సినిమాను వీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్ క్వాలిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాగానే ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’. అని అనిల్ సుంకర … Read more

    విశాఖ నుంచే పాలన: సీఎం జగన్

    విశాఖలో పర్యటనలో భాగంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌ నాటికి విశాఖ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇకపై అక్కడి నుంచే పరిపాలనా విభాగమంతా పనిచేస్తుందని తెలిపారు. విశాఖకు ఉజ్జ్వల భవిష్యత్‌ ఉందని చెప్పారు. త్వరలో విశాఖ మరింత అభివృద్ధి చెందబోతోందని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని సీఎం జగన్‌ వెల్లడించారు.

    AUS vs SL: శ్రీలంక ఆలౌట్

    ప్రపంచ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక లఖ్‌నవూ వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. 21 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 121 పరుగులు చేసిన లంక జట్టు… ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 43.3 ఓవర్లకు 209 పరుగుల వద్ద శ్రీలంక ఆలౌట్ అయింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (61), కుశాల్‌ పెరీరా (78) తప్ప ఇంకెవరూ రాణించకపోయారు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా 4 వికెట్లతో రాణించాడు.

    దిమ్మతిరిగే ఫీచర్లతో టాటా కారు

    టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 17న లాంచ్ కానుంది. ఇది టాటా మోటార్స్ ఫ్లాగ్‌షిప్ కారుగా చెప్పవచ్చు. ఈసారి ఈ SUV హారియర్‌ మోడల్‌ను పూర్తిగా నవీకరించింది. అక్టోబర్ 17న విడుదల కానున్న టాటా హారియర్ SUV పూర్తిగా రిఫ్రెష్ చేసిన కొత్త లుక్‌లో, కొన్ని ఫంకీ-లుకింగ్ కలర్ ఆప్షన్‌లతో రానుంది. పూర్తిగా రీడైజైన్ చేసిన ఇంటీరియర్‌తో సహా అనేక అప్‌డేట్‌లు అయితే హారియర్‌లో వస్తున్నాయి. అలాగే, ఈ SUV BS6 ఫేజ్-2కు అనుగుణంగా పూర్తిగా డీజిల్ ఇంజిన్‌తో రానుంది. మరీ ఈ కారు … Read more

    జనగామకు KCR హామీల వర్షం

    జనగామ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని తెలిపారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జనగామకు ఐటీ, పారిశ్రామికంగా విసృత అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందువల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

    కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ

    తెలంగాణ ఎన్నికల్లో సంపూర్థ మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ ప్రకటించారు. పేదల కోసం కేసీఆర్‌ చాలా పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. బీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు హ్యాట్రిక్‌ సీఎం అవుతారని అసదుద్ధీన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని విమర్శించారు.

    ‘చిన్నా’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

    సిద్దార్థ్‌ హీరోగా నటించిన ‘చిత్తా’ సినిమా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూవీ తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్‌ 6న రిలీజైంది. అయితే తెలుగులో ఈ చిత్రానికి ఆశించినంత కలెక్షన్స్‌ రాలేదు. ఇక ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ‘చిన్నా’ చిత్రం ఓటీటీలోకి రానుందని సమాచారం. Courtesy Twitter: Jayam Ravi Courtesy Twitter: Jayam Ravi Courtesy Twitter: Jayam Ravi

    టీమిండియా చరిత్ర తిరగరాస్తోంది: అక్తర్

    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. 2011 ప్రపంచకప్ చరిత్రను భారత్ తిరగ రాస్తుందన్నాడు. ‘2023 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోంది. వారు సెమీఫైన‌ల్లో తడబడకపోతే భారత్ నిజంగా వరల్డ్ కప్‌ గెలుస్తోంది. టీమిండియా అద్భతంగా ఆడుతోంది. పాక్‌ది చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన భారత్ పాక్‌ను పూర్తిగా చిత్తు చేసింది’ అని అక్తర్ పేర్కొన్నాడు.