• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల

    కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామ బహిరంగ సభలో పొన్నాల సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పొన్నాలకు పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉండి ఎన్నో అవమానాలకు గురయ్యానని పొన్నాల అన్నారు. 45 ఏళ్లు కష్టపడినా పలితం దక్కలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌లో చేరానని పొన్నాల పేర్కొన్నారు.

    గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తా: కేఏ పాల్

    ఎన్నికల్లో తనను గెలిపిస్తే సికింద్రాబాద్‌ను స్వర్గం చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నేడు తుకారం గేట్‌లోని మాంగర్ బస్తీలో పాల్ ఎన్నికల ప్రచారం నిర్శహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు తన పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కేఏ పాల్ సూచించారు.

    ‘తెలంగాణలో 87 స్థానాల్లో టీడీపీ పోటీ’

    తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ టీ-టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. 87 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై జైలులో ఉన్న చంద్రబాబుతో చెర్చించినట్లు కాసాని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది చర్చిస్తామని చెప్పారు. త్వరలోనే అభ్యర్థులు ఖరారు, మేనిఫెస్టో విడుదల చేస్తామని కాసాని వెల్లడించారు.

    భారీగా హవాలా సొమ్ము సీజ్

    హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. వనస్ఠలీపురంలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నరూ. 29.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కావటిగూడలో రూ. 2.80 కోట్లు హవాలా సొమ్ము పట్టుబడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను పోలీసులో అదుపులోని తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు రాష్ట్రంలో ముమ్మర తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే..

    ఖమ్మం కాంగ్రెస్‌ కీలక నేతల సీట్లు ఖరారు

    ఖమ్మం అసెంబ్లీ సీటుపై కాంగ్రెస్ నేతల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. ఖమ్మం​ నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అసెంబ్లీ స్థానాలపై ఓ స్పష్టత వచ్చింది. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ సూచనతో ఈ ఇద్దరు నేతలు ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించారని సమాచారం. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది.

    చంద్రబాబుకు జైలు సరికాదు: మంత్రి మల్లారెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలులో పెడతారా?అని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. దేశంలోనే ది బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన తర్వాత చాలా బాధేసిందని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    రోహిత్ ఆటతీరు అద్భుతం: పాక్ కెప్టెన్

    మ్యాచ్ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్‌ చేశాడని కొనియాడాడు. అతడిని నిలువరించడం కష్టంగా మరిందన్నాడు. ‘తొలుత మాకు శుభారంభమే లభించింది. రిజ్వాన్‌, నేనూ నార్మల్‌గానే ఆడాలనుకున్నాం. కానీ అకస్మాత్తుగా మా​ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. సరైన రీతిలో ఇన్నింగ్స్‌ ముగించలేకపోయాం’ అని బాబర్ చెప్పుకొచ్చాడు. .

    నేడే కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నేడు కాంగ్రెస్ ప్రకటించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తెలిపారు. 58 మంది పేర్లతో తుది జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. వామపక్షాలతో పొత్తుల అంశం తుది దశలో ఉందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే నేతలకు అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. అన్ని మతాలు, కులాలకు కాంగ్రెస్ అధిష్ఠానం పాధాన్యత ఇస్తుందని మురళీధరన్ పేర్కొన్నారు.

    చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య సరిస్థితిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల సూచనలను పాటించేలా చూడాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు సూచించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    INDvsPAK: టీమిండియా హ్యాట్రిక్‌ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. అనంతరం ఛేజింక్‌కు దిగిన టీమిండిడి 30 ఓవర్లకు 192 విజయ లక్ష్యాన్నిఅందుకుంది. టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ (86) గిల్ (16) కోహ్లీ (16) … Read more