• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కీచక టీచర్: విద్యార్థినిపై లైంగిక వేధింపులు

    విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న చిన్నారులపై పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉధ్యాయుడు ఐదో తరగతి బాలికలను లైంగికంగా వేధించాడు. ఆ చిన్నారిపై లైంగిక యత్నం చేశాడు. దీన్ని ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు చిన్నారికి కొంత డబ్బును ఇచ్చాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేని చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది.

    రేవంత్‌ రెడ్డిపై కవిత ఫైర్

    బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రూప్‌-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఆమె మండిపడ్డారు. రేవంత్ రెడ్డి శవాల మీద పేలాలు ఏరుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ”రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తెలిపారు.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    భారతీయులకు కెనడా గుడ్‌న్యూస్

    కెనడా ప్రభుత్వం అక్కడి భారత పౌరులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ తల్లిదండ్రులతో ఎక్కువ కాలం గడిపేందుకు వెసులుబాటు కల్పించింది. తల్లిదండ్రులకు సూపర్‌ వీసా నిబంధనలను సులభతరం చేసింది. ఇమ్మిగ్రేషన్, శరణార్థులు పౌరసత్వ మంత్రిత్వ శాఖ, ప్రజా భద్రత మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు తమ పిల్లలు, మనవళ్లతో కెనడాలో నివాసం ఉండొచ్చు.

    లోకేష్, భువనేశ్వరి భావోద్వేగం

    జైలులో చంద్రబాబును కలిసి ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి ఆందోళన చెందారు. ములాఖత్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే భువనేశ్వరి, లోకేష్ దుఃఖంతో నేరుగా బస కేంద్రానికి వెళ్లిపోయారు. జైలులో చంద్రబాబును చూసి చాలా బాధేసిందని కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

    ”లియో’లో ఆ 10 నిమిషాలు విస్ కావొద్దు’

    విజయ్ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘లియో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. భారీ అంచనాల మధ్య ఇది అక్టోబర్‌ 19న థియోటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అమెరికాలో వినూత్న రీతిలో కార్లు, బస్సులపై ‘లియో’ పోస్టర్లు అంటించి ర్యాలీ నిర్వహించారు. అలాగే కేరళలోనూ విజయ్‌ ఫ్యాన్స్ ఆయన పోస్టర్లతో భారీ బైక్‌ ర్యాలీ చేశారు. లోకేశ్‌ కనగరాజ్‌ మాట్లాడుతూ ‘లియో’ మొదటి నుంచి చివరి వరకూ అలరిస్తుందని మొదటి 10 నిమిషాలు అసలు మిస్‌ కావొద్దని అభిమానులను కోరారు.

    హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

    హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

    వారితో అలా ప్రవర్తించకండి: గంభీర్

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. భారత అభిమానులు ఎవరూ ప్రత్యర్థి పాక్‌ను అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని కోరాడు. అతిథిగా వచ్చినవారి పట్ల గౌరవభావం చూపించాలని తెలిపారు.

    INDvsPAK: పాకిస్తాన్ ఆలౌట్

    వన్డే ప్రపంచకప్‌లో అహ్మదాబాద్‌ వేదిక. భారత్ – పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (47) బాబర్ అజామ్‌ (45) తప్ప మిగిలిన వారు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేక పోయారు. టీమిండియా బౌలర్లు బుమ్రా (2) సిరాజ్ (2) హార్థిక్ (2) కుల్థీప్ యాదవ్ (2) జడేజా (2) వికెట్లు తీసుకున్నారు.

    ఇజ్రాయెల్‌ దాడి.. 2215 మంది మృతి

    ఇజ్రాయెల్‌ దాడిలో గాజాలో 1300 భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో 2215 మంది మృతి గాజా పౌరులు మృతి చెందారు. హమాస్‌ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుంది. గతవారం రోజులుగా ఇజ్రాయెల్‌ సైన్యం పెద్ద పెద్ద భవంతులు పేకమేడల్లా కూల్చేస్తుంది. వీటిల్లో 5,540 హౌసింగ్‌ యూనిట్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఇక మరో 3,743 నివాసాలు మరమ్మతులు చేయలేని విధంగా దెబ్బతిన్నాయి.

    న్యూజిలాండ్‌కు కీలక ప్లేయర్ దూరం

    వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు జట్లుకు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ చేతి వేలి గాయం అయింది. దీంతో అతడు కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. నిన్న జరగిన బంగ్లాదేశ్‌తో​ మ్యాచ్‌లో ఫీల్డర్‌ విసిరిన త్రో విలియమ్సన్‌ ఎడమ చేతి వేలికి తాకింది. నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో చేసి స్కానింగ్‌కు తరలించారు. అయితే స్కాన్‌ రిపోర్ట్‌లో అతడి ఎడమచేతి బొటనవేలు విరిగినట్లు తేలింది. అతడి ప్రత్యామ్నయంగా టామ్‌ బ్లండల్‌కు న్యూజిలాండ్‌ జట్టు మేనెజ్‌మెంట్‌ పిలుపునిచ్చింది.