• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు

    ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.. అక్కడ్నుంచి కొంతమంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆ బందీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉగ్రవాదులు బందీల పిల్లలను ఆడిస్తూ, కన్పించారు. ఓ మిలిటెంట్‌ ఒక చేతిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని చంటిబిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నాడు. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్ని ఇచ్చేందుకే మిలిటెంట్లు ఈ వీడియోను విడుదల చేశారని అభిప్రాయాలు వస్తున్నాయి.

    ‘విక్రమార్కుడు-2’ సీక్వెల్

    ‘టైగర్‌ నాగేశ్వరరావు’ విడుదల సందర్భంగా హీరో రవితేజ ప్రమోషన్లలో బిజీ బిజీ గడుపుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమానే తర్వాత కూడా తీయనున్నట్లు చెప్పారు. ‘వచ్చే ఏడాది మరో కామెడీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నా. ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌ గురించి రాజమౌళితో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇటీవల కాలంలో ‘విక్రమార్కుడు-2’ రానుందని కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజం కాదు’’ అని రవితేజ చెప్పుకొచ్చారు.

    హీరో ఒడిలో కూర్చోమన్నారు: నటి సుహాసిని

    టాలీవుడ్ నటి సుహాసిని ఓ ఈవెంట్‌లో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను నటించిన ఓ సినిమాలో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నానని చెప్పారు. ‘ఓ సన్నివేశంలో హీరో ఒడిలో కూర్చోమన్నారు. దానికి నేను అంగీకరించలేదు. ‘పరాయి వ్యక్తి ఒడిలో ఒక స్త్రీ కూర్చోవడం తప్పు. కాబట్టి నేను ఈ సీన్‌ చేయనని చెప్పా. మరో సినిమాలో హీరో తినే ఐస్‌క్రీమ్‌నే నన్నూ తినమన్నారు. అది నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసింది నేను తినడం ఏంటి? అని గట్టిగా బదులిచ్చా’అని సుహాసిని తెలిపారు.

    ఈ ప్రాంతాలను తప్పక సందర్శించాలి: మోదీ

    ఉత్తరాఖండ్‌లో పుణ్యక్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పవిత్ర క్షేత్రాల జాబితాను షేర్‌ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలనైనా కచ్చితంగా సందర్శించాలని దేశ పౌరులను ప్రధాని కోరారు. రాష్ట్రంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం ఎంతో ప్రత్యేకమన్నారు. ‘కుమావోన్‌ ప్రాంతంలోని పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను తప్పక సందర్శించాల్సిందిగా కోరుతాను. ఎన్నో ఏళ్ల తర్వాత పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌లను సందర్శించడం నాకెంతో ప్రత్యేకం’’ అని ప్రధాని పేర్కొన్నారు.

    జియో నుంచి మరో కొత్త ఫోన్‌

    రిలయన్స్‌ జియో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. జియోభారత్‌ బీ1 పేరిట దీన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్నఫోన్ కంటే అదనపు ఫీచర్లతో దీన్ని తీర్చిదిద్దింది. కంపెనీ వెబ్‌సైట్‌లో దీన్ని లిస్ట్‌ చేశారు. బీ1 ఫోన్‌ ధర రూ.1299. 2.4 అంగళాల తెర, 2,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో జియో యాప్స్‌ అన్నీ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ పేమెంట్స్‌ కోసం జియోపే కూడా ఉన్నట్లు వెల్లడించింది.

    BAN vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66) కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 42.5 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 245 విజయలక్ష్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (45) కేన్ విలియమ్సన్ (78) డారిల్ మిచెల్ … Read more

    రైడ్‌ క్యాన్సిల్‌ చేసిందని అసభ్య వీడియోలు

    క్యాబ్‌ రైడ్‌ బుక్‌ రద్దు చేసుకుందన్న కోపంతో ఓ మహిళ పట్ల డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళకు అసభ్యకర వీడియోలు, ఫొటోలు పంపాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మహిళ బయటకు వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. అయితే, పది నిమిషాల పాటు వేచిచూసినా క్యాబ్‌ రాకపోవడంతో ఆ మహిళ ఆటోలో వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన క్యాబ్‌ డ్రైవర్‌.. ఆమెకు అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను వాట్సాప్‌లో పంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

    ఇండో అమెరికన్లుకు శుభవార్త

    అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు అధ్యక్షుడు జో బైడెన్‌ శుభవార్త చెప్పారు. హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించారు. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌–ఈఏడీ గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్‌ చేసుకునే వారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

    మధ్యవర్తిత్వానికి సిద్ధమే: పుతిన్

    ఇజ్రాయెల్‌- హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాలు ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు, మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా సిద్ధంగా ఉందన్నారు. పౌరులపై ఆయుధాలను ఉపయోగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని చెప్పారు. అమాయకుల మరణాలు ఆమోదయోగ్యం కాదని పుతిన్ వ్యాఖ్యానించారు.

    ఇదే నా చివరి రాజకీయ చిత్రం: వర్మ

    ‘వ్యూహం’ సినిమా తర్వాత అదే నా చివరి రాజకీయ చిత్రమని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు. ‘వ్యూహం’ ట్రైలర్ విడుదల సందర్బంగా ఆయన మట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబును తానేప్పుడూ కలవలేదని చెప్పారు. ఆయనతో ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. తనకు ఏపీ రాజకీయ పరిస్థితులపై పెద్దగా అవగాహణ లేదని చెప్పారు. వ్యూహంలో ఇద్దరు వ్యక్తుల మధ్య దృష్టికోణాన్ని మాత్రమే ఆవిష్కరించామని చెప్పుకొచ్చారు. సమాజంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమా రూపొందించామని వర్మ చెప్పుకొచ్చారు.