• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలయ్య స్వీట్ పర్సన్: శ్రీలీల

    ‘భగవంత్ కేసరి’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షూటింగ్‌లో బాలకృష్ణను చూడగానే భయమేసిందన్నారు. ‘ఆయన్ను కలిసి మాట్లాడగానే టెన్షన్ అంతా మాయమైపోయింది. చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయనది. స్వీట్ పర్సన్, ఈ సినిమాలో తొలి షాట్‌లొ నేను పుషప్స్ చేయలేకపోతుంటే ఆయన పట్టుబట్టి చేయిస్తుంటారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత నిజంగా నీకు పుషప్స్ చేయడం రాదా? బాలకృష్ణ అడిగారు. దర్శకుడే అలా చేయమన్నారని సమాధానమిచ్చా’ అని శ్రీలీల చెప్పుకొచ్చారు.

    లోకేష్ ట్వీట్ బాధ కలిగించింది: KTR

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేష్ ట్వీట్ బాధను కలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కుమారుడిగా లోకేష్ ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలో తనకు ఆందోళన కలిగిందని చెప్పారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే చంద్రబాబు అరెస్టుపై ఆందోళనలు వద్దంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

    లాటరీలో రూ.14.699 కోట్లు జాక్‌పాట్

    అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి జాక్‌‌పాట్ తగిలింది. పవర్‌బాల్ జాక్‌పాట్ లాటరీలో అతడు ఏకంగా 1.765 బిలియన్ డాలర్లు (రూ.14.699 కోట్లు) ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. అయితే ఈ టికెట్ కొన్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

    అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ: రేణూ దేశాయ్

    రవితేజ హీరోగా చేస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో నటి రేణూదేశాయ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. అందులో ఆమె గుర్రం జాషువా కూమార్తె ‘హేమలత లవణం’గా కనిపించబోతున్నారు. ఈ పాత్రపై రేణూ స్పందిస్తూ.. దర్శక, నిర్మాతల వల్లే ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఏదో జన్మలో పుణ్యం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం దక్కిందని చెప్పారు. తన పోస్టర్ చూసి అకీరా ఎంతో సంతోషించాడని రేణూ చెప్పుకొచ్చారు.

    డీఎస్సీ పరీక్ష వాయిదా

    తెలంగాణలో డీఎస్సీ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తాజాగా విద్యాశాఖ ప్రకటించింది.

    BAN vs NZ: న్యూజిలాండ్‌ లక్ష్యం ఎంతంటే?

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్‌ (66) కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (40), హసన్‌ మిరాజ్‌ (30) ఫర్వాలేదనిపించారు. చివర్లో మహ్మదుల్లా (41*) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో బంగ్లా మంచి స్కోరే చేసింది.

    జొమాటో కొత్త సర్వీసు

    ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. జొమాటో ఎక్స్‌ట్రీమ్ పేరిట పార్శిల్ సర్వీసులను ప్రారంభించింది. చిన్న చిన్న పార్శిళ్లను పంపించడం లేదా స్వీకరించడం కోసం ఎక్స్‌ట్రీమ్ సేవలను వినియోగించుకోవచ్చని జొమాటో పేర్కొంది. ఇప్పటికే ఇందులో 3 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు భాగస్వాములుగా ఉన్నారని జొమాటో పేర్కొంది. 10 కి.మీ దూరం వరకు ప్యాకేజీలను పంపించుకోవచ్చని తెలిపింది. ఈ సేవలు రూ.35 నుంచి ప్రారంభమవుతాయని జొమాటో పేర్కొంది.

    జైలులో చంద్రబాబుకు ప్రాణహాని: లోకేష్

    ‘భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది. చంద్ర‌బాబు ఏ హాని జ‌రిగినా, సైకోజ‌గ‌న్ బాధ్య‌త‌’ … Read more

    తెలంగాణలో ‘స్కామ్ గ్రెస్‌’కు చోటు లేదు: KTR

    కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బులు తలిస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని విమర్శించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘స్కామ్ గ్రెస్‌’కు తెలంగాణలో చోటు లేదని మంత్రి పేర్కొన్నారు.

    సన్నద్ధతపైనే నా దృష్టి: బుమ్రా

    రేపు భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత బౌలర్ బుమ్రా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..’ ఏ మ్యాచ్‌కు ముందు అయినా సరే బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోను నా సన్నద్ధత ఎలా ఉందనేదానిపై దృష్టిసారిస్తా. నా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తా. దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకారం ఇస్తుంది. అయితే, కాస్త స్వింగ్‌ రావడంతో దానిని ఉపయోగించుకొని వికెట్లను తీయగలిగాం’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.