• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కష్టపడి పనిచేస్తేనే ఫలితం: చిరంజీవి

    సినీ రంగంలో కష్టపడి పనిచేస్తేనే ఫలితం ఉంటుందని హీరో చిరంజీవి అన్నారు. ఓ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. సినిమాల్లో ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది కష్టపడి డ్యాన్స్‌లు, ఫైట్‌లు చేయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక-నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    ఒలింపిక్స్‌‌లో క్రికెట్

    అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చింది. వచ్చే ఏడాది (పారిస్‌) ఒలింపిక్స్‌లో కాకుండా.. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ జరగనుంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ ఆటకు సైతం ఐఓసీ ఆమోద ముద్ర వేసింది. క్రికెట్‌ను చేర్చడం ద్వారా ఒలింపిక్స్ ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు టోర్నీని మరింత విస్తృత పర్చవచ్చని ఐఓసీ భావింస్తోంది.

    సినిమా నా డీఎన్‌ఏలో ఉంది: సితార

    టాలీవుడ్ నటుడు మహేష్‌బాబు కుమార్తె సితార సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సినిమా తన డీఎన్‌ఏలోనే ఉందన్నారు. ‘నా జీవితంలో నటనకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నా డీఎన్‌ఏలో ఇదీ ఒక భాగం. లెజండరీ సూపర్‌స్టార్‌ కృష్ణగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మా తాతగారు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నా’ అని సితార పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

    13 మంది బందీలు మృతి: హమాస్

    ఇజ్రాయెల్‌పై దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు ఆ దేశ పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. వారిని విడిపించుకునే క్రమంలో ఇజ్రాయెల్ గాజాలో నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలను నిలిపేసింది. గాజాపై బీకర దాడులు చేస్తుంది. అయితే ఈ దాడుల్లో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు 13 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. బందీలను విడిపించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది.

    ఘర్షణలతో ప్రయోజనం ఉండదు: మోదీ

    జీ20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వివాదాలు, ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉందని చెప్పారు. శాంతికి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయమని చెప్పారు. ‘మానవ అవసరాలను తీర్చే విషయంలో అందరం కలిసి గట్టుగా పనిచేయాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఎదుర్కొంటుంది. ఉగ్రదాడిలో వేల మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉగ్రవాదం ఎక్కడున్న ఏ రూపంలో ఉన్న అది మానవాళికి వ్యతిరేకం’ అని మోదీ స్పష్టం చేశారు.

    BAN vs NZ: రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ టోర్నీలో కివీస్ వరస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు. అయితే ప్రస్తుతం మ్యాచ్ జరుగుతుండగా 8 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా 40 పరుగుల చేసింది. 2 వికెట్లు కోల్పోయింది. లిట్టన్ దాస్ (0), తాంజిద్ హసన్ (16) పరుగులు చేసి ఔటయ్యారు.

    అత్తను కాల్చిచంపిన అల్లుడు

    TS: హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓవ్యక్తి అత్తను అల్లుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, ప్రసాద్‌తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌.. తుపాకీని తీసుకుని అత్తగారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అత్త కమలమ్మ(53)కు ప్రసాద్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ప్రసాద్ తుపాకీతో కమలమ్మను కాల్చిచంపాడు.

    నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

    ఏపీలో నిరుద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ గుడ్‌న్యూస్ చెప్పారు. 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు.

    AUS vs SA: ఆసీస్‌ ఘోర ఓటమి

    నేడు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాంటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన ఆసీస్ 40.5 ఓవర్లలో 177 పరుగులకే అలౌల్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్‌ లబుషేన్ (46) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు మిచెల్ మార్ష్‌ (7), డేవిడ్ వార్నర్‌ (13), వన్‌డౌన్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్ (19), పురుగులు చేశారు.

    రోహిత్ డేంజర్‌ బ్యాటర్‌: మాజీ క్రికెటర్

    టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడని కొనియాడారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో హిట్‌మ్యాన్‌ ఎన్నో ఘనతలు సాధించినా అతనికి తగిన గుర్తింపు దక్కడం లేదన్నారు. ‘రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో ఏడు సెంచరీలు సాధించాడు. అతను సిక్సర్లను చాలా అలవోకగా బాదతాడు. అతడికి మనం తగినంత గుర్తింపు ఇవ్వకపోవడం దురదృష్టకరం. రోహిత్ శర్మ వన్డేల్లో డేంజర్‌ బ్యాటర్‌’ అని చోప్రా పేర్కొన్నాడు.