• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వరుడి కోసం వెతుకుతున్నారు: మృణాల్

    తన రిలేషన్‌షిప్, పెళ్లి విషయంపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి విషయంలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. ‘ఇకనైనా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. నా కోసం పెళ్లి కొడుకుని వెతికేపనిలో ఉన్నారు. ఇప్పుడప్పుడే నాకు పెళ్లిపై ఆసక్తిలేదు. నాకు కెనడియన్ నటుడు కీను రీవ్స్ అంటే ఇష్టం అతడి లాంటి వ్యక్తి కోసం నేను ఎదురుచూస్తున్నా’ అని మృణాల్ చెప్పుకొచ్చారు.

    5 లక్షల ఖాతాలపై ఎక్స్ నిషేధం

    ఎక్స్ (ట్విట్టర్) పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. 30 రోజుల్లో మొత్తం 5,59,439 ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలన్ని భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్లు గుర్తించామని ఎక్స్ తెలిపింది. కంపెనీ నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. నిషేధిత ఖాతాలు చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎక్స్ తెలిపింది.

    దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

    తెలంగాణలో దసరా సందడి మొదలైంది. పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో బస్టాండ్‌లు రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. దాదాపు అన్ని బడులలో నిన్న పరీక్షలు ముగిసాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. అనంతరం పాఠశాలలు ముగిసిన తర్వాత హాస్టల్ విద్యార్థులు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వేస్టేషన్, బస్టాండ్‌లు విద్యార్దులతోె కిటకిటలాడుతున్నాయి..

    ‘అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు’

    చంద్రబాబు తప్పు చేయకుండానే అక్రమ కేసులో జైల్లో పెట్టారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేసినందుకా చంద్రబాబు అరెస్టు? అని ప్రశ్నించారు. ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా అని నిలదీశారు. అదే నేరమైతే ఇక ప్రజలకు దిక్కెవరని భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు.

    ‘అందుకే ఎన్టీఆర్ స్పందించ లేదు’

    చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించక పోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై ఎన్టీఆర్ సన్నిహితుడు, నటుడు రాజీయ్ కనకాల స్పందించాడు. ఎన్టీఆర్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారని తెలిపారు. అందుకే ఏపీ రాజకీయాలపై స్పందించక పోయి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. తన పూర్తి సమయాన్నిసినిమాకే కేటాయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో సినిమాపైనే దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ భావించి ఉంటారని అనుకుంటున్నానని రాజీవ్ చెప్పుకొచ్చాడు.

    హాస్పిటల్ బెడ్డుపై సమంత

    హీరోయిన్ సమంత హాస్పిటల్ బెడ్డుపై ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందులో చేతికి సెలైన్ పెట్టించుకుంటూ కనిపించింది. అలాగే మందుల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మరో పోస్ట్ పెట్టింది. తనకు ఈ డ్రిప్సే ఇమ్యూనిటీని అందిస్తాయని చెప్పింది. ఇమ్యూనిటీ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ.. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయానికి రక్త సరఫరా ఈ డ్రిప్పే ఉపయోగపడతాయి అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు బిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

    కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల

    బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..

    RSAvsAUS: ఆసీస్ లక్ష్యం ఎంతంటే

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్లను కోల్పోయి 311 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (109) సెంచరీతో చెలరేగాడు. తెంబా బావుమూ (35).. వాండర్ డసెన్ 26 ఐడెన్ మార్క్రామ్ (55) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, గ్లెన్ మాక్స్‌వెల్ 2 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జాంపా, కమిన్స్ ఒక్కో వికెట్ తీశారు.

    119 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

    తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని YSRTP నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగనున్నానని ప్రకటించారు. తల్లి విజయమ్మ, భర్త అనీల్ కూడా పోటీ చేస్తారని చెప్పారు. పార్టీ బీఫామ్‌ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని నేతలకు షర్మిల సూచించారు.

    ‘అప్పటి వరకు గాజాలో అన్ని బంద్’

    హమాస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ పలు హెచ్చరికలు చేసింది. బందీలుగా ఉన్న తమ పౌరులను సురక్షితంగా విడిచిపెట్టాలని కోరింది. అప్పుడే గాజాకు నీరు, విద్యుత్, ఇందన సరఫరాలు పునరుద్ధరిస్తామని చెప్పింది. అప్పటి వరకు గాజాపై తమ నిబంధనలు కొనసాగుతాయని హెచ్చరించింది. హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నవారు క్షేమంగా ఇళ్లకు పంపాలని చెప్పింది. లేకుంటే తీవ్ర మరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాదులు దాడి చేసిన రెండో రోజు నుంచే గాజాను ఇజ్రాయెల్ అష్టదిగ్భందనం చేసిన విషయం తెలిసిందే..