• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.99కే సినిమా టికెట్

    సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ లభించనుంది. రేపు ఇంటర్నేషనల్ సినిమా డే సందర్బంగా రూ.99కే సినిమా టికెట్ పెందవచ్చు. అయితే ఈ ఆఫర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళకు వర్తించదు. తెలంగాణలో మాత్రం మల్టీప్లెక్స్‌లో రూ.112కు టికెట్ లభించనుంది. దీంతో పలు మల్టీప్లెక్స్‌ల్లో రోజు ఉండే ధరతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు రూ.99కే టికెట్లును అందిస్తున్నట్లు ఆయా చిత్ర బృందాలు ప్రకటించుకున్నాయి.

    TS Election: భోజనం రూ.80.. సమోసా రూ.10

    అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని ఆహారం, సభల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించింది. అభ్యుర్థులు ఎన్నికల ఖర్చులను ఈసీకి సమర్పించే ముందు వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ఖర్చులో భాగంగా చికెన్ బిర్యానీ రూ.140, భోజనం రూ.80 సమోసా రూ.10 మాత్రమే ఖర్చుగా లెక్కిస్తామని ఈసీ … Read more

    అమిత్‌ షాకు అన్ని విషయాలు చెప్పా: లోకేష్

    కేంద్రమంత్రి అమిత్‌ షాతో టీడీపీ నేత నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై షాకు అన్ని విషయాలు వివరించినట్లు లోకేష్ వెల్లడించారు. ‘అమిత్‌ షా నన్ను కలవాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు అమిత్ షాను కలిశాను. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు భద్రత పరంగా ఆందోళన ఉందని చెప్పా. సీఐడీ ఎన్ని కేసులు పెట్టిందని షా అడిగారు. రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పాను’ అని లోకేష్ … Read more

    చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

    hyd: చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఒకjరి మృతదేహాన్ని వెలికి తీశారు. మరొకరి మృతదేహం కోసం గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, బోట్ల సహాయంతో వెతుకుతున్నారు. సికింద్రాబాద్ కౌకూరి దర్గాలో గంధం పండుగ సందర్భంగా నాంపల్లి నుంచి ఆ ఇద్దరు యువకులు వచ్చారని పోలీసులు తెలిపారు.

    ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం

    డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని ప్రగతిభవన్ ఎదుట ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్ (40) తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత సదరు అధికారుల చుట్టూ తిరిగినా వారు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన మహేందర్ కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

    ‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని కేఏపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. వారు గెలిచి మళ్లీ ఆ పార్టీలోనే చేరుతారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న తమ వాళ్లను గెలిపించుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.. అలాగే తెలంగాణ జనసేన, వైసీపీ పార్టీలను కూడా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో 60శాతం మంది బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తమ పార్టీ అభ్యుర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    ‘రోహిత్ కెరీర్‌లో ధోనీదే కీలక పాత్ర’

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనర్‌గా ధోనీనే అవకాశం ఇచ్చారని మాజీ క్రికెటర్ శ్రీ శాంత్ తెలిపాడు. రోహిత్ కెరీర్ ఇలా ఉండటానికి తనే కారణమని ధోనీ ఎప్పుడూ చెప్పుకోలేదని తెలిపాడు. ‘రోహిత్‌కు ధోనీ ఎందుకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడంటే, రోహిత్ అయితే ఆ స్థానంలో అద్భుతమైన ప్రదర్శన చేయగలడని అతడికి బాగా తెలుసు. అలాగే రైనా, విరాట్, అశ్విన్ విషయంలోనూ ధోనీ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. వారితో పాటు నా కెరీర్‌లోనూ ధోనీ కీలక పాత్రపోషించాడు’ అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

    నాందేడ్‌ ఆసుపత్రిలో ఆగని మృత్యుఘోష

    నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగుతోంది. ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తెలిసిందే. ఇప్పుడు గడిచిన ఎనిమిది రోజుల్లో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మరణించగా.. వీరిలో ఓ పసికందు కూడా ఉండటం విచారకరం. ఔషధాల కొరత వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    సమంత నడుముపై ‘చై’ టాటూ మిస్సింగ్

    హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో సమంత పింక్‌ కలర్‌ చీరను ధరించి నడుము అందాలను చూపిస్తూ కనిపించారు.అయితే గతంలో ఆమె నడుముపై ‘చై’ అని వేయించుకున్నారు. అయితే తాజాగా కనిపించిన ఆమె ఫొటోలో నడుముపై టాటూ కనిపించలేదు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘పచ్చబొట్టు తొలగించుకున్నారా?’’, ‘‘పచ్చబొట్టును తొలగించడం కష్టం. కాబట్టి, మేకప్‌ వేసి టాటూను కవర్‌ చేసినట్లు ఉన్నారు’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

    కవితను కాపాడేది బీజేపీనే: నారాయణ

    కేసీఆర్‌ కుమార్తె కవితను కాపాడేది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజీ ఒప్పందం కుదిరిన తర్వాతనే. వైసీపీ, కేసీఆర్‌, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని కుట్ర పన్నారని చెప్పారు. అదానీ కుంభకోణంలో ఎందుకు సెబీ ఎంక్వెయిరీ వేయలేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయనను కాపాడుకుంటున్నారని నారాయణ దుయ్యబట్టారు.