• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంధకారంలోకి ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్‌లో గాజాపై హమాస్ ఉగ్రవాదుల భీకర దాడులను కొనసాగుతున్నాయి. హమాస్‌ విలిటెంట్లు కేంద్రంగా చేసుకున్న అనేక స్థావరాలపై ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు దాడులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్‌.. విద్యుత్తు, ఆహారం, ఔషధాలతోపాటు ఇంధన సరఫరాను నిలిపేసింది. దీంతోపాటు గాజా సరిహద్దులన్నింటినీ మూసివేయడంతో.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి, ఇళ్లు, కార్యాలయాల్లో వాడే జనరేటర్లకు ఇంధనం తీసుకురావడం అసాధ్యంగా మారింది.

    సచిన్ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్

    ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ హిట్‌ మ్యాన్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 63 బంతుల్లోనే రోహిత్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 84 బంతులు రోహిత్‌.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ ఘటత రో​హిత్‌ శర్మకు దక్కింది. రోహిత్‌ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (6) రికార్డును రోహిత్ బ్రేక్‌ చేశాడు.

    అడల్ట్‌ సినిమాలే చేస్తా: ఎక్తా కపూర్

    బాలీవుడ్‌ నిర్మాత ఏక్తా కపూర్‌ తనపై వస్తున్న విమర్శలుకు స్పందించారు. ఏ సర్టిఫికేట్‌ సినిమాలు చేయడం మానేయ్‌ అంటూ నెటిజన్లు విమర్శలకు బదులిస్తూ.. ‘నేనొక అడల్ట్‌. కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా’ అని కౌంటర్‌ ఇచ్చారు. శోభా కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె పలు సినిమాలు, సీరియల్స్‌ను నిర్మించారు. ‘రాగిణి ఎంఎంఎస్‌’, ‘ది డర్టీ పిక్చర్‌’, ‘షాదీ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘ఏక్‌ విలన్‌’, వంటి అడల్ట్ కంటెంట్ మూవీలను ఆమె నిర్ణించారు. ఈ నేపథ్యంలో ఏక్తా నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు … Read more

    IND vs AFG: టీమిండియా ఘన విజయం

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడింది. తొలుత టాస్ నెగ్గిన ఆఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లుకు ఆఫ్గాన్ 8 వికెట్లను కోల్పోయి 272 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 35 ఓవర్లలో నిర్థేశించిన లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ (131) ఇషాన్ కిషన్ (47) విరాట్ కోహ్లీ (55) శ్రేయస్ అయ్యర్ (25) పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు.

    రేవంత్ సీటుకు రేటెంత: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ ఫైరయ్యారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఎన్నికలంటే ఏటీఎం అని విమర్శించారు. రేవంత్ గతంలో ఓటుకు నోటు, ఇప్పుడు సీటుకు నోటు తీసుకుంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌ను రేవంత్‌ అని పిలవడం లేదని రేటెంత.. రేటెంత.. అని అంటున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి మళ్లీ పోటీ చేస్తున్నాడన్నాడన్నారు.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న తెలంగాణకు ఏమీ చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

    భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

    అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాక్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానున్నారు. ఆయనతో పాటు 60 మంది జర్నలిస్టుల కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా అష్రష్ మట్లాడుతూ “నేను గురువారం భారత్‌కు పయనం కానున్నాను. నా ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇందుకు చాలా సంతోషంగా ఉంది’ అని … Read more

    ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

    రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన యాక్షన్ మూవీ ‘స్కంద’ చిత్రం థియేటర్లలో రిలీజై మాస్‌ని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి తొలి రెండు మూడు రోజులు కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు తగ్గింది. తాజాగా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. స్కంద రిలీజ్‌కి ముందే డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‪స్టార్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక సినిమా రిలీజైన నెలలోపే అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం.

    అహ్మదాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఈ రెండు జట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. భారత్, ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ముగించుకున్న తర్వాత అహ్మదాబాద్‌కు పయనం కానుంది.

    ఆ ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు: లోకేష్

    IRR కేసులో టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు లోకేష్‌ను దాదాపు 47 ప్రశ్నలు అడిగారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియా మాట్లాడారు. హైకోర్టు ఒక్కరోజే విచారణకు హాజరవ్వాలని చెప్పింది. అధికారుల నోటీసు మేరకు రెండో రోజు హాజరైయ్యా.. వాషింగ్‌ మెషిన్‌లో తిప్పినట్లు మంగళవారం అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. కొత్తగా ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదు’ అని లోకేష్ తెలిపారు.

    విద్యార్థినిపై అధ్యాపకుడు అత్యాచారం

    Ap: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రైవేటు అధ్యాపకుడు దారి తప్పాడు. ఓ విద్యార్ధిని బెదిరిస్తూ పులుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో గర్భం దాల్చిన ఆమెపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ కళాశాలలో విద్యార్ధిని ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటి వద్ద దింపే నెపంతో సదరు విద్యార్థినిని ఓ రోజు అధ్యాపకుడు బైక్‌పై తీసుకెళ్లాడు. పట్టణ శివార్లలోకి తీసుకెళ్లి ఆమె అసభ్యకర చిత్రాలను ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.