• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజస్థాన్‌ పోలింగ్ తేదీలో మార్పు

    కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీలో పలు మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్‌ 23న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 25కి మారుస్తూ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో ఎధావిధిగానే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది. రాజస్థాన్‌లో ఎన్నికల రోజు పెద్ద సంఖ్యలో వివాహాలు/శుభకార్యాలు/ సామాజిక కార్యక్రమాలు ఉండటంతో ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బంది కలుగుతుందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

    రైతులకు మోదీ సర్కార్ గుడ్‌న్యూస్

    దేశంలోని రైతులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.2 వేలు అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే కేంద్రంపై రూ.20వేల కోట్ల మేర అదనపు భారం పడనుంది.

    సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం

    తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేరు పెడుతున్నట్టు తెలిపారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్‌ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తంజావూరులోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను స్వామినాథన్‌ అగ్రికల్చరల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా మారుస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు.

    ‘బాలకృష్ణలో మార్చు వచ్చింది’

    హీరో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. భగవంత్ కేసరి సినిమా ఎంత గొప్పగా ఉందో టైలర్ చూస్తేనే అర్థమవుతుందన్నారు. ‘అఖండ’ చిత్రం తర్వాత బాలకృష్ణలో చాలా మార్పు వచ్చిందన్నారు. దసరాకు విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పారు. సినిమా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయని పరుచూరి కొనియాడారు.

    హైకోర్టులో చంద్రబాబుకు స్వల్ప ఊరట

    చంద్రబాబు పిటిషన్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంగళ్ల కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయోద్దని ఆదేశించింది. IRR కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయోద్దని స్టే ఇచ్చింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ జరిపింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా ఉత్తర్యులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.

    ‘బబుల్‌గమ్’ టీజర్ విడుదల

    సినీ నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. తాజాగా రోషన్ నటిస్తున్న ‘బబుల్‌గమ్’ చిత్రం నుంచి టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రోషన్‌కు జోడీగా మానస చౌదరి నటిస్తోంది. మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    PAK vs SL: పాకిస్థాన్ విజయం

    శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్‌ ఛేదించింది. 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పాక్ 345 లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (113) మహ్మద్ రిజ్వాన్ (131) పరుగులు చేసి జట్టుకు విజయం అదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది.

    చంద్రబాబుకు డీహైడ్రేషన్‌

    చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురయ్యారు. గత కొద్ది రోజులుగా జైల్లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా తీవ్రమైన ఉక్కపోత నెలకొంది. చంద్రబాబు ఉంటున్న బ్లాక్‌లో ఫ్యాన్‌ కూడా లేకపోవడంతో ఆయన ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్‌కు గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు.. వైద్యాధికారికి కూడా ఫిర్యాదు చేశారు.

    గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా

    తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్‌ చేశారు. TSPSC Group 2 Examను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్‌-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

    ‘చంద్రముఖి2’పై స్పందించిన లారెస్స్

    లారెన్స్ ‘చంద్రముఖి2’ ఫలితంపై స్పందించారు. ”ఈ సినిమా ద్వారా నా డబ్బులు నాకు వచ్చాయి. లైఫ్‌లో అన్నీ మనం గెలవాలని లేదు. ఈ గ్లామర్‌ను పెట్టుకుని హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన వరం. మళ్లీ దానిలో ఫ్లాప్‌, హిట్‌లు గురించి ఆలోచించకూడదు. కంటెంట్‌ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి’ లారెస్స్ చెప్పుకొచ్చారు.