• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ మంత్రికి షాకిచ్చిన సైబర్ నేరగాళ్లు

    కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 99,999 నగదు దుండగులు కొట్టేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డిజిటల్‌ ఇండియాలో వ్యక్తిగత సమాచారం సురక్షితంగా లేదని చెబుతూ ఆయన మోసం జరిగిన తీరును వివరించారు. ఓటీపీ అవసరం లేకుండా, తన వ్యక్తిగత మొబైల్‌కు ఎలాంటి పేమెంట్ లింక్‌ రాకుండా సైబర్‌ నేరగాళ్లు నగదు కొట్టేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    అమిత్‌ షా అన్నీ అబద్దాలే: కేటీఆర్

    కేంద్ర మంత్రి అమిత్‌ షాకి తెలంగాణలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అమిత్‌ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. బీజేపీకి మళ్లీ భాజపాకు 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు ఖాయమన్నారు. పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ విమర్శించారు.

    ‘జైలర్‌’ కోడలు గ్లామర్‌ ట్రీట్‌

    యంగ్‌ బ్యూటీ మిర్నా మీనన్‌.. మరోమారు తన గ్లామర్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, పలుచటి బ్లాక్‌ కలర్‌ శారీలో అందాలు ఆరబోసింది. శారీలో ఈ బ్యూటీ పరువాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాప్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ అందాలను చూసేందుకు YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి

    ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయితే ఇలా చేయండి?

    కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ ఖాతాలను హ్యాక్ చేసి మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. మరి కొందరు అసభ్య చిత్రాలను పోస్ట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మీ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయినట్లయితే ఈ టిప్ ఫాలో అయితే సింపుల్‌గా అకౌంట్‌ను రికవరీ చేసుకోచ్చు.. ముందుగా వెబ్‌బ్రౌజర్‌లో facebook.com/hacked అని సెర్చ్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే My account is compromisedపై క్లిక్ చేయండి. తర్వాత కనిస్తున్న దానిలో ఇ-మెయిల్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫేస్‌బుక్ ఖాతాను తిరిగిపొందొచ్చు.

    దానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదు: లోకేష్

    టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను ప్రశ్నించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. నన్ను సీఐడీ 50 ప్రశ్నలు అడిగింది. అందులో ఈ కేసులో నేను ఎలా లాభపడ్డానో ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కక్ష సాధింపు కోసమే నాపై ఎలాంటి ఆధారాలు లేని కేసు పెట్టారు. మళ్లీ రావాలని … Read more

    ENG vs BAN: ఇంగ్లాండ్ విజయం

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభంలోనే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (74) రహీమ్ (51) హృదయ్ (39) పరుగులు చేసి పర్యాలేదనిపించారు.

    విమానం హైజాక్.. నకిలీ మెయిల్ కలకలం

    ఎయిర్‌ఇండియా విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు వచ్చిన మెయిల్ కలకలం రేపింది. ప్రయాణికుల్లో ఒకరు ఐఎస్‌ఐ ఇన్‌ఫార్మర్ ఉన్నాడని మెయిల్ రావడంతో అధికారులు అలర్టయ్యారు. బయలుదేరబోతున్న విమానాన్ని ఆపి నాలుగు గంటలపాటు తనిఖీలు చేశారు. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో అధికారులు ఉపిరిపీల్చుకున్నారు. వచ్చింది నకిలీ మెయిల్ అని గుర్తించారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే: అమిత్ షా

    డిసెంబర్ 3వ తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఆలస్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లు అధికారంలో ఉన్నా పేదల సమస్యలు తీర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిందని పేర్కొన్నారు. 9ఏళ్లుగా మోదీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రావని అమిత్‌ షా స్పష్టం చేశారు.

    థియేటర్లకు సెన్సార్ బోర్డు నోటీసులు

    విజయ్ దళపతి హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.. ఈ ట్రైలర్‌ను చెన్నైలోని కొన్ని థియోటర్లలో ప్రదర్శించారు. అయితే దాన్ని ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డు లీగల్ నోటీసులు జారీ చేసింది. సెన్సార్ కట్ లేకుండా థియేటర్లలో చూపించారని పేర్కొంది. అభ్యంతర పదాలతో కూడిన ట్రైలర్ చూపించారంటూ సెన్సార్ బోర్టు సదరు థియేటర్ల యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

    కటతడి పెట్టుకున్న అమితాబ్

    ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌‌లో బాలీవుడు స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఆనందంతో కటతడి పెట్టుకున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ నిర్వాహకులు అమితాబ్‌ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ఇండస్ట్రీలోని ప్రముఖులైన చిరంజీవి, విద్యాబాలన్‌, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీలతో శుభాకాంక్షలు చెప్పించారు. దీంతో ఒక్కసారిగా అమితాబ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఈ సెట్‌లో నా పుట్టినరోజు వేడుక నిర్వహించడం ఎంతో ప్రత్యేకం’ అంటూ ఆనందంతో బిగ్‌బీ కంటతడి పెట్టుకున్నారు.