• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs SL శ్రీలంక భారీ స్కోరు

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు చేశాడు. సధీరా సమరవిక్రమ 89 బంతుల్లో 108 పరుగులు రాబట్టాడు, ఓపెనర్ పాథుమ్ నిశాంక 61 బంతుల్లో 51 పరుగులు చేసి పాక్ బ్యాటర్లు ముందు భారీ స్కోరు … Read more

    ‘మార్క్ ఆంటోని’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

    విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తమిళంలో ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.

    క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు

    ఆఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్గాన్ భూకంప బాధితులకు తన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. రషీద్ మాట్లాడుతూ.. ‘ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చింది. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. భూకంపంలో దాదాపు 2400 పైగా మృతి చెందడం బాధను కలిగించింది’. అని రషీద్ పేర్కొన్నాడు.

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన గిల్

    డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ కొలుకున్నాడు. తాజాగా అతడు ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో రేపు ఆఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గిల్ అందుబాటులో ఉండటం లేదు. ఆఫ్గన్‌తో మ్యాచ్ కోసం అతడు ఢిల్లీ వెళ్లలేదని బీసీసీఐ పేర్కొంది. గిల్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ 14 భారత్, పాక్ మ్యాచ్‌కు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలున్నాయి తెలుస్తోంది.

    మా మద్దతు వారికే: మోదీ

    ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి భారత్ వ్యతిరేకమని అది ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని తెలిపారు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని చెప్పారు. హమాస్ ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు భారత్ తోడుగా నిలుస్తోందని ప్రధాని భరోసా ఇచ్చారు.

    చనిపోయినట్లు నటించినా గుర్తించి చంపేశారు

    ఇజ్రాయెల్‌ పౌరులపై హమాస్‌ ఉగ్రవాదులు నరమేధం కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు ఓ మహిళ చనిపోయినట్లు నటించింది. అయినా ఆమె శ్వాసను గుర్తించి మరీ ఉగ్రవాదులు ప్రాణం తీశారు. మాపల్‌ ఆడమ్‌ (27) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో ఆమె ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించింది. అయితే ఆమె శ్వాస తీసుకోవడాన్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆమెను హతమార్చారు.

    వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌

    యూజర్లకు వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇందులో మన వ్యక్తిగత వాట్సాప్‌ను ఇతరులు ఓపెన్‌ చేసినా సంబంధిత చాట్‌లు వీక్షించకుండా ఒక పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ‘సీక్రెట్‌ కోడ్‌’ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది లాక్‌ చేయాలనుకున్న వ్యక్తిగత చాట్‌లన్నింటినీ సీక్రెట్‌కోడ్‌ ద్వారా లాక్‌ చేసేయెచ్చు. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయగానే లాక్‌ వేసిన చాట్స్‌ ఓపెన్‌ అవుతాయి.

    ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీజర్‌ రిలీజ్

    టాలీవుడ్ నటుడు సుహాస్‌ హీరోగా దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వంలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా నటింస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించారని అర్థమవుతోంది. ఈ సినిమాను బన్నీవాసు, వెంకటేశ్‌ మహా సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    ఆ సినిమాకు నో చెప్పడం మంచిదైంది: లారెన్స్

    రాఘవ లారెస్స్ హీరోగా, ఎస్‌జే సూర్య విలన్‌గా కార్తీక్ దర్శకత్వంలో ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో నటి నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఓ థియోటర్‌లో నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ.. గతంలో ‘జిగర్తండా’ చిత్రానికి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. అది వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ.100 కోట్లతో రూపొందుతున్న ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని లారెన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

    ENG vs BAN: బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం

    ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ , బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు డేవిడ్ మలన్ 107 బంతుల్లో 140 పరుగులు చేశాడు. జానీ బెయిర్ స్టో 59 బంతుల్లో 52 పరుగులు చేశాడు. జో రూట్ 68 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా పరుగులు పెట్టించారు.