• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘గేమ్ ఛేంజర్‌’ ఓటీటీ రైట్స్‌ ఫిక్స్‌

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ మళ్లీ పట్టాలెక్కనుంది. ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ మూవీ OTT రైట్స్‌ను ZEE5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ హక్కుల కోసం అన్నీ భాషలకు కలుపుకుని సుమారు రూ.250 కోట్లు ZEE5 చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే, రామ్ చరణ్ చిత్రానికి సంబంధించిన అత్యధిక డీల్‌గా ఇదీ చరిత్రలో నిలిచిపోతుంది

    హమాస్‌ దాడిలో 9 మంది మృతి

    ఇజ్రాయెల్‌లో హమాస్‌ జరిపిన దాడిలో తొమ్మిది మంది అమెరికాన్లు ప్రాణాలు కోల్పోయారు. కొద్ది మంది అమెరికన్‌ పౌరుల ఆచూకీ తెలియకుండా పోయిందని అమెరికా వెల్లడించింది. తొలుత నలుగురు చనిపోయినట్లు పేర్కొనగా.. తాజాగా ఆ సంఖ్య తొమ్మిదికి చేరిందని అమెరికా ప్రకటించింది. అయితే, ఆచూకీ తెలియని వారు బందీలుగా ఉన్నారా..? చనిపోయారా..? అన్నది స్పష్టత లేదని వాషింగ్టన్‌ వెల్లడించింది.

    నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం

    నిర్మాత దిల్‌ రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు.

    డబ్బుకాదు.. డాలర్లు అడగండి: కేటీఆర్

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లెక్క కుదిరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3 కౌండింగ్ రెండు కలిపితే 6 ఇది మాకు అచ్చొచ్చిన నంబర్ అని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తారని అవి కాకుండా డాలర్లు కావాలని అడగండని ప్రజలకు కేటీఆర్ సూచించారు.

    NZ Vs NED: న్యూజిలాండ్ రెండో విజయం

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం సాధించింది. నేడు న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. దీంతో 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. .

    కిలోల కొద్ది బంగారం, వెండి సీజ్‌

    HYD: చందానగర్ పీస్ పరిధిలోని తారానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్‌ నంబర్‌ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద ఓ కారులో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కుటుంబాన్ని తప్పించి.. తూటాలకు బలై..

    ఇజ్రాయెల్‌‌లో అమాయక ప్రజలను హమాస్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో మన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. ఉగ్రవాదుల బారి నుంచి తన కుటుంబాన్ని రక్షించుకుని తను మాత్రం హమాస్‌ల తూటాలకు బలయ్యాడు. ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డాన్ని గమనించి ఆ వ్యక్తి వెంటనే ఇంటి కిటికీ నుంచి కుటుంబసభ్యులను తప్పించాడు. ఈ క్రమంలో తాను తప్పించుకుంటుండగా అప్పటికే ముష్కరులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కిటికీ వద్దే ప్రాణాలు కోల్పోయాడు. GRAPHIC: A heartbreaking video of a father … Read more

    ‘ఆదిపురుష్’కు ఊరట.. కేసులు కొట్టేసిన సుప్రీం

    హీరో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందని కొందరు కోర్టుమెట్లు కూడా ఎక్కారు. తాజాగా వాటిన్నిటిని కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికెట్ ఇచ్చాక.. ఇక ఏ విషయంలో విచారణ అవసరం లేదని సుప్రీం పేర్కొంది. దీనిపై కోర్టు వాదనలు వ్యర్థమేనని చెప్పింది. అయితే ఆదిపురుష్ చిత్రాన్ని ఓంరౌత్ దర్శకత్వం వహించారు. చిత్రంలోని పాత్రల వేషధారణ, కొన్ని సన్నివేశాల్లో వాడిన బాషపై విమర్శలు వచ్చాయి.

    కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్: రేవంత్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు విమర్శలతో ఆసక్తికర ట్వీట్ చేశారు. కల్వకుంట్ల స్కాంలీకి కౌంట్ డౌన్ మొదలైందని విమర్శించారు. ‘ఇది.. దగాపడిన యువత, ఆగమైన అన్నదాత కన్నెర్ర చేస్తూ చెప్తున్న కౌంట్ డౌన్. ఇది.. కన్నీళ్లు పెట్టిన సర్కారు బడి చిన్నారి, పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగిన పెద్ద మనిషి చేస్తున్న కౌంట్ డౌన్. ఇది.. నిలువ నీడలేని పేద కుటుంబం, మాట్లాడే స్వేచ్ఛలేని మేధావి వర్గం నినదిస్తున్న కౌంట్ డౌన్. ఈ 52 రోజుల కౌంట్ డౌన్ నియంత సర్కారుకు రాస్తున్న … Read more

    ఓటర్లకు సీఈవో కీలక సూచనలు

    తెలంగాణలో ఎన్నికల కోట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రత్యేక ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని వెల్లడించింది. ఫిర్యాదుల కోసం 1950ను సంప్రదించాలి ఎన్నికల సంఘం పేర్కొంది.