• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కస్టమర్లకు షాకిచ్చిన HDFC బ్యాంక్

    ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్స్ దిగ్గజం HDFC కస్టమర్లకు షాకిచ్చింది. ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ HDFC బ్యాంక్ లెండింగ్ రేట్లను పెంచేసింది. ఎంపిక రుణాలపై లెండింగ్ రేట్లను గరిష్టంగా 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతే కాకుండా బేస్ రేటును 5 బేసిస్ పాయింట్లు, ఇదే సమయంలో బెంచ్‌మార్క్ PLR 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ రేట్లు సెప్టెంబర్ 25 నుంచే అమల్లో ఉన్నాయి.

    NZ vs NED: నెదర్లాండ్స్ లక్ష్యం ఎంతంటే?

    న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్ జట్లు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా తలపడుతొన్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న న్యూజిలాండ్.. 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (70) రచిన్ రవీంద్ర (51) టామ్ లాథమ్ (53) మిచెల్ (48) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు.

    ఏదీ ఊరికే రాదు: ఆనంద్ ట్వీట్

    ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియా షేర్ చేశారు. అందులో జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా గేమ్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడవచ్చు.. దీనిపై ఆనంద్ స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు. ‘నీరజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే అది ఊరికే రాలేదు. ఎన్నో రోజులు చేసిన కృషి, పట్టుదల వల్లే అతడు ఈ స్థాయికి వచ్చాడు. కాబట్టే ఏదీ ఊరికే రాదు, దానికి తగ్గ ప్రయత్నం చేయాల్సిందే’ అంటూ మోటివేషన్ ట్యాగ్‌తో ఆనంద్ మహీంద్రా … Read more

    షారుక్ నుంచి ఎన్నో నేర్చుకున్నా: అలియా భట్

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. దర్శకులు సంజయ్‌లీలా భన్సాలీ, కరణ్ జోహార్ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. షారుక్ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా సెట్‌లో ఎలా కలిసిమెలసి ఉండాలో షారుక్ నుంచి నేర్చుకున్నా.. నాపై ప్రభావం చూసిన వ్యక్తుల్లో షారుక్ ఒకరు. ప్రతి సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతనిని చూసిన నేర్చుకున్నా’.. అని అలియా చెప్పుకొచ్చింది. అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ చిత్రంలో నటిస్తుంది.

    ఆ వార్తలు బాధించాయి: చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ కొందరు జర్నలిస్టులు రాసిన న్యూస్ దుమారం సృష్టిస్తుంటాయి. నేను కూడా కొన్ని వార్తల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయి. వాటి ప్రభావం ఇంకా నా జీవితంపై ఉంది అలానే జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతా ఇంతా కాదని, దాని ద్వారా మంచి చెప్పొచ్చు’ అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

    చంద్రబాబు పిటిషన్ వాయిదా

    చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ కేసును కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరిగింది.

    అలా చేస్తే పరువైనా దక్కుతుంది: హరీష్‌రావు

    బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. స్వంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో గెలిపిస్తారా? అని విమర్శించారు. తెలంగాణలో డిపాజిట్ల కమిటీనైనా వేసుకుంటే బీజేపీకి పరువైన దక్కుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హంగ్ ఏర్పడదని కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని హరీష్‌రావు కోరారు. మంచిర్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

    మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్

    పాలమూరు ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు..BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉంది. కానీ బిజెపి స్టీరింగ్..అదాని చేతిలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం… మిలియన్ డాలర్ జోక్’. అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

    అలాంటి వాళ్లకు హ్యాట్సాఫ్: సమంత

    హీరోయిన్ సమంతపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సమంత పోస్ట్ చేసిన ఓ ఇస్‌స్టా స్టోరి వైరల్‌గా మారింది. సమంతకు ఇష్టమైన పెంపుడు కుక్క, నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలో కనిపించింది. అయితే దీనిపై నెటిజన్లు పలు రూమర్స్ సృష్టించారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా జీవిత మార్గంగా మార్చుకునే వారికి హ్యాట్సాఫ్’ అని కొటేషన్‌ను షేర్ చేశారు. ఇది చూసిన వారు ఆ … Read more

    అందుకే ఆసీస్ ఓడిపోయింది: మాజీ సెలెక్టర్

    నిన్న జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్ ఫలితంపై మాజీ సెలెక్టర్ కరీం తన విశ్లేషణను వెల్లడించాడు. ‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్ వేయించి ఫలితం సాధించాడు. రవీంద్ర జడేజా స్పెల్‌ను లైన్‌కు కట్టుబడి బౌలింగ్ అద్భుతంగా వేశాడు. చాలా రోజుల తర్వాత ఆడుతున్న అశ్విన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్ ఎటాక్‌ను రోహిత్ నిడిపించిన తీరు బాగుంది. ఆసీస్ ఆటతీరే వారి ఓటమికి కారణమైంది’ అని కరీం చెప్పుకొచ్చాడు.