• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యద్ధం ఎఫెక్ట్: పెరిగిన చమురు ధరలు

    ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్‌ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చమురు సరఫరాలపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    చంద్రబాబుకు పిటిషన్ డిస్మిస్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది.

    చంద్రబాబుపై సింపతి పెరిగింది: మురళీమోహన్

    టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం బాధను కలిగిస్తోందని నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిని జైలులో పెట్టడం సరికాదన్నారు. అవినీతి మచ్చలేకుండా చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ప్రజల్లో ఆయనపై సింపతి పెరిగిందన్నారు. ఎచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతుందని మురళీమోహన్ అన్నారు..

    టెలిగ్రామ్‌లో ఒక్కరోజే 2వేల ఛానెళ్లు బ్యాన్

    సోషల్ మీడియా వేదికలకు కేంద్రం హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.. బాలల లైంగిక వేధింపులకు సంబంధించి సమాచారాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ చర్యలు చేపట్టింది. నేడు ఒక్కరోజే 2114 గ్రూపులు. ఛానెళ్లను బ్యాన్ చేసింది. ఈ నెలలో మొత్తం 10,312 గ్రూప్స్, ఛానెళ్లపై నిషేధం విధించినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. చట్టపరమైన, నైతిక విలువలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపింది. ఐటీ చట్ట నిబంధనలను తప్పక పాటిస్తామని టెలిగ్రామ్ పేర్కొంది.

    ‘బిగ్‪‌బాస్ 7’ డబుల్ ఎలిమినేషన్

    బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్‌గా మారిపోయింది. అయితే ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోపలికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ వారం శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అవబోతున్నారని చర్చసాగుతోంది. గత వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ చేసి పంపేశారు.

    యూజర్లు వీఐ గుడ్‌న్యూస్

    తమ యూజర్లకు ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్‌ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, కేవలం ఇది పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. వీఐ మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.401 నుంచి ప్రారంభమవుతున్నాయి.

    బిగ్‌బాస్ తర్వాత నా భార్య బాధపడింది: హీరో

    రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్‌లో భార్యభర్తలైన యాక్టర్స్ వరుణ్ సందేశ్-వితిక జంటగా పాల్గొన్నారు. అయితే తాజాగా వరుణ్ దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్ షో నుంచి బయటకొచ్చిన నా భార్య బాధపడింది. అలా షోను ఎడిట్ చేసి చూపించారని చెబుతూ చాలా ఫీలైంది. గంట ఎపిసోడ్‌లో ఓ మనిషిని చూసి వాళ్ల క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తారు. అది నన్ను చాలా బాధించింది’. అంటూ వరుణ్ చెప్పుకొచ్చారు.

    చంద్రబాబుకు మద్దతుగా ‘కాంతితో క్రాంతి’

    చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు వినూత్న కార్యక్రమం చెప్పట్టారు ‘కాంతితో క్రాంతి’ పేరుతో టీడీపీ నిరసన చేపట్టింది. రాత్రి 7 గంటల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇళ్లలో లైట్లు ఆపి, దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేష్, హైదరాబాద్‌లో బ్రాహ్మణి దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

    ఆసియా క్రీడల్లో మెరిసిన తెలుగు తేజం

    ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతిసురేఖ పతకాలను గెలుచుకోవడంపై ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 13 ఏళ్ల బ్యోతిసురేఖ ఆర్చరీలో దేశం గర్వపడేలా మూడు బంగారు పతకాలు సాధించింది. ఇప్పటి వరకు భారత్ 102 పతకాలు సాధించింది. అందులో 27 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి

    TSRTC ఫెస్టివల్ ఛాలెంజ్‌

    టీఎస్‌ఆర్టీసీ ‘100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌ చేసింది. ‘100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్’ ఛాలెంజ్‌ను నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. ‘ఆర్టీసీ ఉద్యోగులు దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో ప్రయాణికులకు, నాణ్యమైన సేవలు అందించాలి. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్‌ల మాదిరిగానే ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలి అలా చేసిన ఉద్యోగులకు బహుమతులు ఉంటాయి.