• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌-ఆసీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం?

    భారత్‌-ఆస్ట్రేలియా జరుగబోయే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం పొంచిఉంది. చెన్నైలో రేపు పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ సమయంలో జల్లులు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రేపటి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా వాష్‌ అవుట్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని తెలుస్తుంది. అయితే డెంగీతో బాధపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరంకానున్నాడని సమాచారం.

    దోమలను ఆసుపత్రికి తెచ్చిన వ్యక్తి!.. వైద్యులు షాక్

    పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వ్యక్తి చేసిన పనికి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తనకు కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. దీంతో వైద్యుడుతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. అలీ షేక్ అనే వ్యక్తి ఇంటి వద్ద దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో అతడు భయంతో దోమలను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి వచ్చాడు.

    అలాంటి వారు నా సినిమా చూడకండి: దర్శకుడు

    ‘మంత్ ఆఫ్ మధు’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంపై ఆలోచనలేనివాళ్లు తమ సినిమా చూడడానికి రావద్దని అన్నారు. అలాంటి వాళ్లు దయచేసి థియేటర్లకు రాకండని ఓపెన్‌గా చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలను ఎదుర్కోగలిగిన వారి కోసమే ‘మంత్ ఆఫ్ మధు’ అని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో హీరోగా నవీన్ చంద్ర, హీరోయిన్‌గా కల్లర్ స్వాతి, నటించారు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యింది.

    భూకంపం.. 14 మంది మృతి

    అఫ్గానిస్థాన్‌లో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. అఫ్గానిస్థాన్‌‌లో ఉదయం భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 6.3గా నమోదైందని USGS వెల్లడించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా. అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. ఘటన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    RSA vs SL: సౌతాఫ్రికా భారీ స్కోరు

    వరల్డ్ కప్‌లో నేడు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా విధ్వంసం సృష్టించింది. శ్రీలంకపై రికార్డు స్థాయిలో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 428కి పైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108), ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు.

    రేవంత్‌ రెడ్డి బీజేపీ మనిషి: అసదుద్దిన్

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ సినిమా మా దగ్గర ఉంది. టీడీపీ నేత చంద్రబాబు పని అయిపోగానే కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉన్నా ఆయన జీవితం బీజేపీ, ఆరెస్సెస్‌తో ముడిపడి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలు అరెస్సెస్ నాలుక నుంచి వస్తున్నవి, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డితో రేవంత్ పనిచేయడాన్ని చూశాను. అరెస్సెస్‌తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో రేవంత్ ప్రమాణం చేస్తారా’? అని అసదుద్ధిన్ … Read more

    బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్

    క్యాసినో కింగ్‌గా పేరుగాంచిన చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలో చేరారు. బర్కత్‌పూరలోని బీజేపీ కార్యాలయంలో చీకోటి పార్టీ కండువా కప్పుకున్నారు. అతడిని బీజేపీ నేత డీకే అరుణ, ప్రవీణ్‌కు పార్టీ కండువా కప్పి సాధర ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

    ఇజ్రాయెల్‌‌కు అండగా ఉంటాం: మోదీ

    ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ పౌరుల మృతిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యా ఈ విపత్కర పరిస్థితిల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం, అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మిలిటెంట్ల హింసాత్మక దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    విడుదలకు సిద్దమైన ‘యాక్షన్ థ్రిల్లర్’

    నటులు రెహ్మన్, భరత్ కలిసి నటించిన ‘సమరా’ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి చార్టెస్ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇందులో కాడ్ బిజాల్, ప్రసన్న, ప్రముఖ పాత్రలు పోషించారు. బజరంగీ భాయిజాన్ ఫేమ్ మీర్ సర్వార్ విలన్‌గా నటించారు. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘సమరా’ తెరకెక్కింది. తమిళం, మలయాళం, కన్నడం, భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ‘జవాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

    ఇటీవల విడుదలైన ‘జవాన్’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. షారుక్ కెరియర్‌లో రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో చిత్రంగా ‘జవాన్’ నిలిచింది. థియేటర్లలోకి వచ్చి నెల దాటిపోయినా ‘జవాన్’ ఇప్పటికీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమైంది. జవాన్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు స్వంతం చేసుకుంది. ఈ సందర్భంగా నవంబర్ 2న ‘జవాన్’ చిత్రం ఓటీటీలోస్ట్రీమింగ్ కానునట్లు సమాచారం.