• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మొదలైన వరుణ్‌, లావణ్యల పెళ్లి వేడుకలు

    హారో వరుణ్‌ తేజ్, నటి లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. తాజాగా చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. కొణిదెల కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిరు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘వరుణ్‌తేజ్‌ లావణ్యల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిన్న సాయంత్రం వేడుకగా జరిగాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

    AFG vs BAN: బంగ్లాదేశ్‌ విజయం

    వరల్డ్‌కప్‌-2023లో అఫ్ఘనిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. నేడు ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బంగ్లాదేశ్ బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘన్‌ 156 పరుగులకే 37.2 ఓవర్లలో అలౌల్ అయింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 156 పరుగులు లక్ష్యాన్ని చేరుకుంది.

    షారుక్ రికార్డును బ్రేక్ చేసిన ‘లియో’

    విడుదలకు ముందే హీరో విజయ్ నిటించిన ‘లియో’ చిత్రం సరికొత్త ట్రెండ్‌ను క్రియోట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఈ టికెట్స్ మొదటి రోజు సేల్స్ షారుక్ సినిమాలను అధిగమించింది. ‘లియో’ చిత్రానికి నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. యూకేలో వీటిని రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. ‘లియో’ మొదటి రోజు టికెట్స్ బుకింగ్స్ షారుక్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. లియో ఫస్ట్‌డే షో కోసం 30వేల మంది టికెట్స్ బుక్ చేసుకున్నారని … Read more

    ‘టీడీటీ అధికారంలోకి వస్తే పరిస్థితేంటి’

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల పరిస్థితేంటని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు హెచ్చరిస్తున్నారని తెలిపారు. వారు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులు ఆలోచించాలన్నారు. వాలంటీర్లు 90 శాతం మంది వైసీపీ మద్ధతుదారులు ఉన్నారని చెప్పారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే మారుస్తామని బాలినేని పేర్కొన్నారు.

    Asian Games: భారత్‌దే బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించింది. అఫ్గానిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు స్వర్ణం గెలుచుకుంది. తొలుత టాస్‌ నెగ్గి భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లకు 112/5 స్కోరు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. అప్పటికి వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో భారత్‌ గెలిచినట్లు ప్రకటించారు.

    నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత

    ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు క్యాంపస్ ఎదుట బైటాయించి ధర్నాకు దిగారు. కళాశాల యాజమాన్యం వచ్చి సర్థి చెప్పినా విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Asian Games: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం

    ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ 101 పతకాలు సాధించింది. అందులో 26 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా కీడల్లో భాగంగా భారత్-అఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం 18.2 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 1121/5 పరుగులు చేసింది.

    Pak Vs Ned: పాకిస్థాన్ విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. బాస్ డి లీడ్ (67), విక్రమ్ జిత్ సింగ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు.

    ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం

    ఎక్స్ (ట్విటర్‌) అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మరో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఎక్స్‌ను యూజర్లకు ఎన్ని యాడ్స్‌ కావాలనుకుంటున్నాదో దానికి అనుగుణంగా డబ్బులు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం వెరిఫైడ్‌ అకౌంట్లకు నెలకు రూ.650, ఏడాదికి రూ.6,800 చెల్లించి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారో వాళ్లకి ఇది అవసరం లేదని చెప్పారు.

    Pak Vs Ned: పాకిస్థాన్ విజయం

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. బాస్ డి లీడ్ (67), విక్రమ్ జిత్ సింగ్ (52) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు విఫలం అయ్యారు.