• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నక్సలిజం మానవాళికి శాపం: అమిత్‌ షా

    దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. 2022లో నక్సల్‌ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో హింస, మరణాలు తగ్గిపోయాయని తెలిపారు. ‘నక్సలిజం మానవాళికి శాపమని. మేము దానికి సంబంధించిన అన్ని రూపాలను నిర్మూలించామని చెప్పారు. వామపక్ష తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ‘నేషనల్‌ పాలసీ అండ్ యాక్షన్‌ ప్లాన్‌’ను ఆమోదించిన విషయాన్ని అమిత్‌ షా గుర్తు చేశారు.

    ‘అయలాన్’ టీజర్ చూశారా?

    కోలీవుడ్ హీరో శివకార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ‘అయలాన్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..ఈ సినిమాకు రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు వర్షన్ ఈ చిత్ర టీజర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. 24ఏఎం స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. తెలుగు, తమిళం, హింది, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

    TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదల

    TSPSC గ్రూప్‌-4 తుది ‘కీ’ విడుదలైంది. ఈ ‘కీ’ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో వెరిఫై చేయించి తాజాగా తుది కీ విడుదల చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. 80శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

    సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరికలు

    కేంద్రం సోషల్ మీడియా వేదికలకు హెచ్చరికలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీచేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం హోదాను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటువంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అందులో కేంద్రం పేర్కొంది.

    హీరోగా రాజీవ్ కనకాల తనయుడు

    టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడి తొలి సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే రోషన్ తొలి చిత్రానికి ‘బబుల్ గమ్’ అనే పేరును పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే అందులో రోషన్ బబుల్ గమ్ నములుతూ కనిపించాడు. రవికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రోషన్‌కు జోడీగా మానస చౌదరి నటిస్తోంది.

    టీచర్‌పై విద్యార్థులు కాల్పులు

    ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు స్కూల్ విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్ టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి ఓ వీడియో సందేశాన్ని పంపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కోచింగ్ సెంటర్లో పాఠాలు చెబుతున్న టీచర్‌ను విద్యార్థులు బయటకు రమ్మని పిలిచారు. వెంటనే అక్కడకు వచ్చిన టీచర్‌పై సదరు విద్యార్థులు వరస కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయం కావడంతో టీచర్‌ను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    జగన్‌ది అసమర్థ పాలన: పవన్

    ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు సైతం 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జగన్ అసమర్థ పాలనలో సమస్యలు లేవనెత్తితే దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు వాయిదా వేయించుకోవడానికి జగన్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.

    గడుపు ముగిసినా రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు

    RBI రూ.2వేల నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 8వ గడువు ముగిసిన తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. రూ.2000 నోట్లు ఉపసంహరణకు ముందు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు RBI పేర్కొంది. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని వెల్లడించింది.

    భారీగా పట్టుబడిన గంజాయి

    విశాఖలోని పెందుర్తిలో భారీగా గంజాయి పట్టుబడింది. వేపుగంటలోని ఓ ఇంట్లో పోలీసులు 200 కిలోల గంజాయిని గుర్తించారు. దీన్ని అల్లూరి జిల్లా ముంచంగిపుట్టుకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు దంపతులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

    మద్యం మత్తులో ప్రయాణికులపై మూత్ర విసర్జన

    మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంవర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి ఏసీ కోచ్‌లో పై బెర్త్‌లో పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లో పడుకుని ఉన్న ఇద్దరు దంపతులపై వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. నిందితుడిని పట్టుకుని ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు.