• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pak Vs Ned: 49 ఓవర్లలో పాక్‌ ఆలౌట్‌

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (68) సౌద్‌ షకీల్‌ (68) మహ్మద్ నవాజ్ (39) పరుగులు చేసి జట్టు స్కోరును అందించడంతో తోడ్పడ్డారు.

    కక్ష సాధింపు కోసమే చంద్రబాబు అరెస్ట్: లోకేష్

    అవినీతిని ప్రశ్నించినందుకే చంద్రబాబును జైలులో పెట్టారని టీడీపీ నేత లోకేష్ ఆరోపించారు. జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేష్ ములాఖత్‌ అయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెడుతున్నాడు. స్కిల్‌ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతని చెప్పి తర్వాత రూ.300 కోట్లు అంటున్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వైసీపీ అక్రమాలపై న్యాయపోరాటం కొనసాగిస్తాం’. అని లోకేష్ పేర్కొన్నారు.

    టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

    TS: టీచర్ల బదిలీలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 వరకు ఎలాంటి బదిలీలు చేపట్టరాదని కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్యులు జారీ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌‌ఆప్షన్‌కు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్‌ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. తాజాగా దీనిపై హైకోర్టు స్టే … Read more

    విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం

    కోలీవుడు స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంతో అభిమానులు అసహనానికి గురైయ్యారు. ఈ క్రమంలో థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/ManobalaV/status/1709938471673155614/video/1

    ఇరాన్ మహిళకు శాంతి నోబెల్

    ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్‌ మొహమ్మది ఎపికయ్యారు. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు నర్గేస్‌కు శాంతి బహుమతి లభించింది. ఆమె చేసిన వీరోచిత పోరాటంలో భాగంగా నర్గేన్ 31 సంవత్సరాల జైలును కూడా అనుభవించారు. ఆమె ఇంకా జైలులోనే ఉన్నారు.

    BRSకు ఎమ్మెల్యే రాజీనామా

    BRSకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆమె బహిరంగ ప్రకటన చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేస్తానన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. BRS ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యుర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే..

    కేసీఆర్‌పై నడ్డా ఘాటు విమర్శలు

    BRSపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో బీజేపీ కౌన్సిల్‌ సమావేశంలో నడ్డా మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కేంద్రం 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో BRS కుటుంబపాలన అంతం కావడం ఖాయం. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయి. BRS కుటుంబ పార్టీ. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా … Read more

    Asian Games: భారత్‌తో అఫ్గాన్ ఫైనల్ పోరు

    ఆసియా క్రీడల్లో భాగంగా నేడు రెండో సెమీస్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టును అఫ్గానిస్థాన్ ఓడించింది. ఈ క్రమంలో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకు 115 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన అఫ్గాన్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్-పాక్ పోరును చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ తలపడనుంది.

    ‘మ్యాడ్‌’ సినిమా పూర్తి రివ్యూ

    ప్రస్తుతం టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ సినిమా హవా బాగా పెరిగిపోయింది. యువతను ఆకట్టుకునే అంశాలను కథాంశంగా చేసుకొని పలు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం మ్యాడ్‌ (MAD) తెరకెక్కింది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఇవాళ థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అసలు మూవీ కథేంటి? వంటి అంశాల కోసం YouSay Webపై క్లిక్ చేయండి.

    ఎస్సై పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

    ఏపీలో ఎస్సై పోస్టుల భర్తికి రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అక్టోబర్ 12 నుంచి హాల్‌టికెట్లను APSLPRB అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు నగరాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో రాతపరీక్షలు జరగనున్నాయి. హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌ నుంచి డైన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఏవైనా సమస్యలు ఎదురైతే 9441450693, 9100203323 నెంబర్లను సంప్రదించవచ్చు.