• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది: బ్రాహ్మణి

    టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. టీడీపీ “కాంతితో క్రాంతి” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అక్టోబర్ 7, రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‍ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం అని బ్రాహ్మణీ పిలుపునిచ్చారు.

    తమ్ముడిని నరికి చంపిన అన్న

    హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వేధిస్తున్నాడన్న అనుమానంతో అన్న తమ్ముడిని హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. షబ్బీర్‌ అహ్మద్‌ తన భార్యను తమ్ముడు సాజిద్‌ వేధిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    చిరు న్యూ లుక్.. అదుర్స్

    మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. క్లీన్ షేవ్‌‌ చేసుకుని యంగ్ లుక్‌తో ఉన్న చిరూను చూసి అభిమానులు ‘చిరు లుక్ అదుర్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్‌ను చిరంజీవి కలిసి అభినందించారు. ఈ క్రమంలో ఆయనతో కలిసి తీసుకున్న ఫొటోను చిరు పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న చిరు న్యూ లుక్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసమే అనే చర్చ జరుగుతోంది.

    థాయిలాండ్‌లో సూర్య అందుకే?

    ప్రస్తుతం హీరో సూర్య ‘కంగువ’ చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తాజా అప్‌డేట్ వినిపిస్తోంది. షూటింగ్‌ తుది దశకు చేరుకుందని సమాచారం. దీని చివరి షెడ్యూల్‌ థాయిలాండ్‌లోని అడవుల్లో జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం అక్కడకు చేరుకుందని సమాచారం

    అమరావతికి మోదీ ఇచ్చింది గుండు సున్నా: KTR

    ఏపీలో అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ గుండు సున్నా ఇచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ కూడా ప్రజలు గుండు సున్నా ఇవ్వాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి రజనీకాంత్ అమెరికాలో తిరిగినట్లు ఉందన్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త. నేడు కరెంట్ పోతే వార్త అని ఉచిత విద్యుత్‌ను రైతులకు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దని మంత్రి చెప్పుకొచ్చారు.

    అందుకే జబర్దస్త్‌కు దూరం: అనసూయ

    సినీనటి అనసూయ నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌‌ను ఆమె ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వేదికపై అనసూయ డ్యాన్స్‌ చేసి అభిమానులను అలరించారు. ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వరస సినిమా ఆఫర్లతోనే జబర్దస్త్‌కు దూరంగా ఉంటున్నాట్లు ఈ సందర్భంగా అనసూయ తెలిపారు.

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 50 మంది మృతి

    రష్యా క్లిపణి దాడిలో ఉక్రెయిన్‌లో 50 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్కివ్‌ రీజియన్‌ కుపియాన్స్క్‌ జిల్లాలోని గ్రోజా గ్రామంపై ఈ దాడి జరిగింది. ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రష్యా క్షిపణులతో విరుచుకపడింది. దాడి జరిగిన ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. మరోపైపు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ బలోపేతానికి సాయం చేయాలని మిత్రదేశాలను అభ్యర్థించింది.

    ENG vs NZ: న్యూజిలాండ్ విజయం

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. డేవాన్ కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు … Read more

    ఎన్డీయేలో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?: పవన్

    కైకలూరు వద్ద ముదినేపల్లిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ‘టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలు తీరుస్తాం. నేను ఎన్డీయే కూటమితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? వైసీపీకి ఎందుకు అంత భయం. మేము గెలిచిన రోజున దమ్ముంటే వైసీపీ నేతలు ఇళ్లలోనో ఆఫీసుల్లోనో కూర్చోండి చూద్దాం. ఏ పోలీసులతో కేసులు పెట్టించారో అదే పోలీసులతో మక్కెలు ఇరగతీయిస్తాం. భవిష్యత్తులో వైసీపీ గెలిస్తే ప్రజలు ఆస్తి ప్రతాలు జగన్ చేతుల్లో ఉంటాయి’. అని పవన్ ఆరోపించారు.

    రాహుల్‌‌ గాంధీని రావణుడితో పోల్చిన బీజేపీ

    కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ రాహుల్ ఫొటో కింద క్యాప్షన్‌తో బీజేపీ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. ‘మోదీ ఒక అబద్ధాల కోరు ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదు’ … Read more