• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీపై పుతిన్ ప్రశంసలు

    ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ఎన్నో విజయాల సాధించిందన్నారు. మోదీ ప్రారంభించిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను పుతిన్‌ మెచ్చుకొన్నారు. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భారత్‌ అనుసరిస్తున్న విధానం ఆదర్శమని పుతిన్ చెప్పుకొచ్చారు. భారత్-రష్యా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

    ‘లియో’ ట్రైలర్‌ రిలీజ్

    విజయ్‌ దళపతి హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘లియో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెసిందే. కశ్మీర్‌ నేపథ్య కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘లియో’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ నటనకు అభిమానులు ఫిదా కావాల్సిందే.. యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. అర్జున్‌ – విజయ్‌లపై చిత్రీకరించిన సీన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

    TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

    తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాఠశాలల్లో అల్పాహార పథకాన్నిఅమలు చేయనుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అమల్లోకి రానుంది. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.

    సినీ స్కామ్‌పై బ్రహ్మాజీ ట్వీట్

    సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కొత్తరకం స్కామ్‌పై నటుడు బ్రహ్మాజీ జాగ్రత్తలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘స్టార్ దర్శకుల వద్ద పని చేస్తున్నామని చెప్తూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాలో అవకాశం వచ్చిందని నమ్మబలుకుతున్నారు. డబ్బులిస్తే ఆడిషన్‌కు అవసరమైన కాస్ట్యూమ్స్ కొంటామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. సినిమా పరిశ్రమలోకి రావాలని కలలుకనే కొత్తతరం నటులను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండీ’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశారు.

    కాంగ్రెస్‌కు అధికారమే ముఖ్యం: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు పైనే ఎక్కువ ద‌ృష్టి సారిస్తుందని విమర్శించారు. రైతులు, జవాన్ల సంక్షేమాన్ని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం గెహ్లాట్ అవినీతి బయటకు రావాలంటే రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మోదీ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

    ENG vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఫిక్స్

    వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరిగింది. తొలుత టాస్‌ నెగ్గి న్యూజిలాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 9 వికెట్లను కోల్పోయి 282 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ (77) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జోస్ బట్లర్ 43, జానీ బెయిర్‌స్టో 33, డేవిడ్ మలన్ 14, హ్యారీ బ్రూక్ 25, మొయిన్ అలీ 11, లియామ్‌ లివింగ్‌ స్టోన్ 20 పరుగులు … Read more

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    సిల్క్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.

    సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

    సింగరేణి కార్మికులకు ఆ సంస్థ చైర్మన్ శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంస్థ లాభాల్లో వాటా ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు.. దసరా కానుకగా ఈ నెల 16న రూ.711.18 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సంస్థకు వచ్చిన రూ.2222.46 కోట్ల లాభాాల్లో కార్మికులకు 32 శాతం ఇస్తామన్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మేర బోనస్ అందుతుందని శ్రీధర్ తెలిపారు.

    Ind vs Aus: పక్కా ప్లానింగ్‌తో ఉన్నాం: కమిన్స్

    వన్డే ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియా అక్టోబర్ 8న చెన్నై వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారత స్పిన్నర్లను తమ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. భారత్‌తో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో తలపడిన సందర్భాలు ఉన్నాయి. భారత బౌలర్లు ఎలా వేస్తారనేదానిపై మా బ్యాటర్లకు అవగాహణ ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు ఉంటాయి. మేం విజయం సాధించగలమన్న నమ్మకం ఉంది. భారత గడ్డపై వన్డేల్లో మెరగైన రికార్డే ఉంది’. అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

    రవితేజకు సారీ చెప్పిన బాలీవుడ్ నటుడు

    గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ టాలీవుడ్ హీరో రవితేజకు సారీ చెప్పారు. 1988లో రవితేజ తన ఆటోగ్రాఫ్ అడిగితే కుదరదని చెప్పానని, అప్పుడు అలా అన్నందుకు ఇప్పుడు సారీ చెబుతున్నానన్నారు. రవితేజ నటించిన పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’లో అనుపమ్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.