• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 పరీక్షలు తిరిగి నిర్వహిస్తాం: కేటీఆర్

    ప్రెస్‌ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ ‘TSPSC నుంచి రద్దైన 4 పరీక్షలు మళ్లీ తిరిగి నిర్వహిస్తాం. అభ్యర్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కోచింగ్ మెటీరియల్ ఉచితంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడతాం. స్టడీ సెంటర్‌లో 24 గంటలు రీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచుతాం, ఉచిత భోజన వసతి కల్పిస్తాం’ అని మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు అభయం ఇచ్చారు.

    పేపర్ లీక్ చేసింది బీజేపీ కార్యకర్తే: కేటీఆర్

    TSPSC ప్రశ్నాపత్రాలు లీకవడం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం. పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. నిందితుడిగా ఉన్న రాజశేకర్ రెడ్డి బీజేపీ క్రియశీల కార్యకర్త అని తెలిపారు. లీకేజీలో కుట్ర కోణం దాగిఉందని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

    బ్లాక్ డ్రెస్‌లో హీట్ పెంచిన కృతి సనన్

    ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ లెటెస్ట్ అవుట్ ఫిట్[ వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్లీవ్ లెస్‌లో అందాల ఆరబోతగా చేసింది. హాట్ లుక్స్‌లో కెమెరా పనితనానికి పని పెంచింది. కాస్త బక్కచిక్కినట్లుగా కనిపించింది. ప్రస్తుతం కృతిసనన్ మెకోవర్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. @kritisanon looked eternally gorgeous as she was spotted at an event last night! Drop a ❤️ her..#bollywood #zoomtv #zoompapz #celebspotted #entertainment #kritisanon pic.twitter.com/kq0YXQtkNb — @zoomtv (@ZoomTV) March 18, … Read more

    అమెరికాలోని కీలక నగరాలతో కైలాస దేశం ఒప్పందం

    అమెరికాలోని ప్రముఖ నగరాలతో సాంస్కృతిక భాగాస్వామ్యం నెలకొల్పేందుకు నిత్యానంద పావులు కదుపుతున్నారు. తన సృష్టించుకున్న కైలాస దేశంతో అమెరికాలోని రిచ్‌మండ్, వర్జీనియా, డేటన్, నెవార్క్, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సిస్టర్-స్టేట్ ఓప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కైలాస దేశ వెబ్‌సైట్ తెలిపింది. అయితే ఈ ఓప్పందం జరిగిన తీరును ఫాక్స్‌ న్యూస్‌ తప్పుబట్టింది. ఉనిఖిలో లేని దేశంతో ఎలా ఓప్పందాలు కుదుర్చుకుంటారని విమర్శించింది.

    11 మంది టీడీపీ సభ్యులు సస్పెండ్

    ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాలు జరగకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ తమ్మినేని పలుమార్లు వారించినా టీడీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను స్వీకర్ సస్పెండ్ చేశారు. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడటం గమనార్హం.

    వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం

    NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. వీటీపీఎస్‌లోని లిఫ్ట్ ఒక్కసారిగా విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 8మంది ఉన్నారు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    యూట్యూబ్ ట్రెండింగ్‌ కస్టడీ #1

    నాగచైతన్య నటించి కస్టడీ మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో #1 ర్యాంకులో కొనసాగుతోంది. మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ఫవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా కస్టడీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది.

    NTR కుటుంబంతో 35 ఏళ్లుగా పోటీ

    ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ మీడియాతో ఆసక్తికరమైన [విషయాన్ని](url) వెల్లడించారు. భవిష్యత్తులో అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.అలాగే గత 35ఏళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంతో సినిమాల పరంగా, ఫ్యాన్స్‌పరంగా తీవ్రమైన పోటీ నడుస్తూనే ఉందన్నారు. అయితే వ్యక్తిగతంగా తమ కుటుంబాల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. జూ.ఎన్టీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. Ram Charan said, "Virat Kohli is an inspiration. It'll be amazing if … Read more

    శ్రీవారి దర్శనానికి 12 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల వరకు సమయంపడుతోంది. వైకుంఠ కాంప్లెక్సుల్లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,938 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 30,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ప్లాస్టిక్ గోదాం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. పక్కనే ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు విద్యార్థులను అధికారులు ఖాళీ చేయించారు. రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పెద్దఎత్తున వ్యాపించిన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.