• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్లాక్‌ పాంథర్‌’తో నీరజ్‌ చోప్రా

    మార్వెల్‌ సినిమేటిక్‌ యూనివర్స్‌లోని బ్లాక్‌బస్టర్‌ సూపర్‌హీరో చిత్రం “ బ్లాక్‌ పాంథర్‌”. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భారత ఒలింపిక్‌ వీరుడు నీరజ్‌ చోప్రాను ఉపయోగించుకుంటున్నారు. “అన్‌స్టాపబుల్‌ నీరజ్‌ చోప్రా మీట్స్ బ్లాక్‌ పాంథర్‌” అంటూ ట్విట్టర్‌లో ఓ [వీడియో](url) షేర్‌ చేసింది. ఈ సినిమా తొలిభాగంలో నటించిన చాడ్విక్‌ బోస్‌మన్ అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా చాడ్విక్‌కు చక్కని నివాళి ఇస్తుందంటూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. Flight of the javelin meets … Read more

    భూమి లేకుండానే రూ.70 లక్షల పంట

    యూపీకి చెందిన వీర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చి ఏటా రూ.70లక్షల విలువైన పంట పండిస్తున్నాడు. గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన వీర్‌ సింగ్‌, హైడ్రోఫోనిక్‌ సాగు గురించి తెలుసుకుని “వింపా ఆర్గానిక్స్‌ అండ్‌ హైడ్రోఫోనిక్స్‌” అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. తన 3 అంతస్థుల ఇంటిని వ్యవసాయక్షేత్రంగా మలుచుకున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను పెంచుతూ ఔరా అనిపిస్తున్నాడు. This man earns 70 lakhs growing vegetables in a 3 storey … Read more

    ఐస్‌క్రీం కోన్‌పై గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్

    ఒక కోన్‌పై మూడు కాదు నాలుగు కాదు ఏకంగా 125 స్కూప్‌ల ఐస్‌క్రీం పెట్టి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియెర్రా. ఈ ఫీట్‌తో గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్‌ రికార్డు తమ అధికారిక ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. కోన్‌పై వరుసగా రంగురంగుల ఐస్‌క్రీంను ఇటుక మీద ఇటుకలా పేర్చడం మీకు కనిపిస్తుంది. ఇంతకీ దీనిని తినేదెవరు భయ్యా! అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by … Read more

    కరీంనగర్‌లో స్మశానంలో దీపావళి వేడుకలు

    దీపావళి అనగానే లక్ష్మీపూజలు, టపాసుల సంబరాలు గుర్తొస్తాయి కానీ కరీంనగర్‌లో మాత్రం స్మశానంలో దీపావళి వేడుకలు చేసుకుంటారు. కరీంనగర్‌ పాకానగడ్డ హిందూ స్మశానవాటికలో సమాధులను అలంకరించి దీపాలు వెలిగించి వేడుకలు చేసుకుంటారు. తమ పూర్వీకులకు ఇష్టమైన ఆహారం, పానీయాలు అందిస్తూ వారిని పూజించుకుంటారు. తమవారు భౌతికంగా వెళ్లిపోయినా..తమతోనే ఉన్నట్లుగా భావించి వారితో కలిసి పండుగ చేసుకుంటామని స్థానికులు చెబుతున్నారు.

    వాట్సాప్‌ డౌన్‌పై మీమ్స్‌ మోత

    ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అనేక మంది మెసేజ్‌లు చేయలేకపోతున్నారు. సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వాట్సాప్‌ చెప్పింది. అయితే వాట్సాప్‌లో నిత్యం 10 వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తాయి. 150 దేశాల్లో వాట్సాప్‌కు యూజర్లు ఉన్నారు. దీంతో ట్విట్టర్‌లో ఇప్పుడు వాట్సాప్‌పై మీమ్స్‌ మోత మోగుతోంది. అనేక మంది వాట్సాప్‌ ఆగిపోవడంపై ఫన్నీ మీమ్స్‌ చేస్తున్నారు. అందులో కొన్ని మీరు కూడా చూడండి.

    “ లైక్‌,షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌” ట్రైలర్‌

    సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న కామెడీ చిత్రం “లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌”. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. కామెడీ, సీరియస్‌ సీన్ల మిశ్రమంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. నెల్లూరు సుదర్శన్‌ టైమింగ్‌ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్‌ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

    దీపావళి సంబరాల్లో 41 మందికి గాయాలు

    దీపావళి సంబరాల్లో పలువురి విషాదాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌లో టపాసుల కారణంగా గాయపడిన వారి సంఖ్య 41కి చేరింది. బాధితులంతా సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. 41 మందిలో 19 మందికి చికిత్స అందించి పంపించారు. మిగతా వారందరూ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరికి వైద్యులు కంటి ఆపరేషన్‌ పూర్తిచేశారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more

    ‘రేప్‌’కు గురైన బాలికను వీడియోలు తీసిన స్థానికులు

    అభం, శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై కీచకులు అఘాయిత్యానికి పాల్పడి, రక్తపు మడుగులో పారేసి వెళ్తే…సాయం చేయాల్సిందిపోయి, ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆ చిన్నారిని ఫోటోలు, వీడియోలు తీసిన అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. కన్నౌజ్‌ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పాపను చేతుల్లో మోసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నాడు. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. #kannauj #Kannaujgirl pic.twitter.com/mglIuwA0ce — youth point … Read more

    “మిడిల్‌ క్లాస్‌ జిందగీ” బ్యూటిఫుల్‌ వీడియో

    “మాకు మమ్మీ కన్నా అమ్మ పిలుపులోనే కమ్మదనం ఉంటుంది. మాకు డాడీ గ్యాడ్జెట్‌ కన్నా నాన్న సైకిల్‌పై షికారు సరదాగా ఉంటుంది. మా ఇంటి బూస్టు డబ్బాలో పప్పు ఉంటుంది. పోపు డబ్బాలో పైసలు ఉంటాయి. నా పాత ప్యాంటు మా ఇంటి డోర్‌ మ్యాట్‌గా ఉంటుంది. నా పాత చొక్క వంటింట్లో మసి గుడ్డగా ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువైనా సంబరాన్నిస్తుంది. అమ్మా, నాన్నలను హత్తుకోవడంలోనే ప్రపంచం ఉంటుంది. మేం మిడిల్‌ క్లాస్‌ వాళ్లం. చిన్న చిన్న వాటిలోనే గొప్ప ఆనందాల్ని వెతుక్కుంటాం” … Read more

    దీపావళి వేడుకల్లో 24 మందికి గాయాలు

    తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు కన్నుల పండువగా జరిగిప్పటికీ అక్కడక్కడా విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 24 మంది గాయపడ్డారు. కళ్లకు గాయాలతో సరోజినీ కంటి ఆసుపత్రిలో చేరారు. వీరిలో 12 మంది చిన్నారులే ఉన్నారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూడండి. Till now 24 people, including children had sustained different kinds of eye … Read more